Nagababu | పెద్దల సభకు నాగబాబు | Eeroju news

పెద్దల సభకు నాగబాబు

పెద్దల సభకు నాగబాబు విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Nagababu ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కూటమి నేతలు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. దాంతో రాజ్యసభలో 11 మంది…

Read More

Congress | కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ నాయకులు | Eeroju news

కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ నాయకులు

కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ నాయకులు విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Congress ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచిందా? వైసీపీ లేని లోటును భర్తీ చేసే పనిలో పడిందా? తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయ్యిందా?లడ్డూ వ్యవహారం తర్వాత కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.తిరుమల లడ్డూ వ్యవహారంపై గత వైసీపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దాని నుంచి తప్పుకునేందుకు కుంటుసాకులు వెతుకుతోంది. ఒకప్పుడు ఆ పార్టీ నేతలు సీబీఐ విచారణ కావాలంటూ గొంతెత్తారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పెషల్ సిట్ వేయడంతో ఆ పార్టీ నేతలకు నోటి వెంట మాట రాలేదు. సింపుల్‌గా చెప్పాలంటే లడ్డూ వ్యవహారంపై తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధినేత జగన్. సిట్ లేదు.. బిట్టు…

Read More

Nara Lokesh | పట్టుబిగిస్తున్న నారా లోకేష్ | Eeroju news

పట్టుబిగిస్తున్న నారా లోకేష్

పట్టుబిగిస్తున్న నారా లోకేష్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై ప్రత్యర్థులు చేయని ప్రచారం లేదు. కానీ తనకు తానుగా పనితనం నిరూపించుకుని ముందుకు సాగారు లోకేష్. ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పోగొట్టుకున్న చోట వెతుక్కున్నారు. గెలిచిన తర్వాత హంగు ఆర్భాటానికి దూరంగా ఉన్నారు. తనకు దక్కిన మంత్రి పదవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తనదైన మార్కు కనిపించేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.గత ఐదేళ్ల వైసిపి పాలనలో విద్యావ్యవస్థలో అనేక లోపాలు వెలుగు చూశాయి. వాటిని సరి చేసే పనిలో ఉన్నారు లోకేష్. నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని వైసిపి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వచ్చారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.పాఠశాలల సర్దుబాటు,విలీన ప్రక్రియతో వేలాది విద్యాసంస్థలు…

Read More

YS Sharmila | షర్మిళ రివర్స్ బాణం | Eeroju news

షర్మిళ రివర్స్ బాణం

షర్మిళ రివర్స్ బాణం విజయవాడ, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) YS Sharmila ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ స్పీడ్ పెంచారా.. ఒక వైపు కూటమికి, మరోవైపు వైసీపీకి తన కామెంట్స్ తో షాకిస్తూ.. రాజకీయంగా బలోపేతం కానున్నారా.. పక్కా వ్యూహంతో ఏపీలో కాంగ్రెస్ ను బలమైన పార్టీగా నిలపాలన్న తన లక్ష్యం వైపు షర్మిళ సాగుతున్నట్లు ఏపీ కాంగ్రెస్ ముఖచిత్రం కనిపిస్తోంది.మొన్నటి వరకు తన అన్న మాజీ సీఎం జగన్ లక్ష్యంగా.. విమర్శల వర్షం కురిపించిన షర్మిళ.. తన గురి కూటమి వైపుకు తిప్పినట్లు ఉందని తాజాగా ఆమె విమర్శలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తాను ముందుంటానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి షర్మిళ ఘాటుగానే స్పందించారు.అధికారం లేని సమయంలో…

Read More

IPS Sunil Kumar | మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్ | Eeroju news

మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్

మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్ విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) IPS Sunil Kumar వైఎస్ఆర్‌సీపీ హయాంలో కీలకంగా పని చేసి ప్రస్తతం పోస్టింగ్ లేకండా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత జూలైలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై పదిహేను రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. పీవీ సునీల్ కుమార్ నుంచి స్పందన వచ్ిచన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా పని చేశారు.ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజును రాజద్రోహం కింద సుమోటోగా…

Read More

Changes in inter education | ఇంటర్ విద్యలో మార్పులు | Eeroju news

ఇంటర్ విద్యలో మార్పులు

ఇంటర్ విద్యలో మార్పులు విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Changes in inter education ఏపీ ఇంటర్ విద్యలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడే అవకాశం ఉంది.ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలను అమలు చేయాలని భావిస్తోంది. పరీక్షల విధానంతో పాటు సిలబస్ ను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను కూడా తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.…

Read More

Jethwani | సీఐడీకి జెత్వానీ కేసు | Eeroju news

సీఐడీకి జెత్వానీ కేసు...

సీఐడీకి జెత్వానీ కేసు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Jethwani ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్‌ కేసు ఇప్పుడు చేతికి వెళ్లబోతుందట. ఇప్పటికే బెయిల్‌ కోసం ఫైట్ చేస్తున్న ఆ ఆఫీసర్లకు..సీఐడీ గుబులు వెంటాడుతోందట. ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా.? ఇంకొందరు ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ మెడకు చుట్టుకోబోతోందా.? పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు. తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు. పర్మిషన్లు, చట్టాలు ఇవేవి అడ్డురావు. అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు. అలాగని సమయం కలసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. పవర్‌ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు. ప్రభుత్వం మారింది. పాపాల చిట్ట బయటపడుతుంది. ఒకటా రెండా..స్యాండ్‌, మైన్‌, వైన్‌..చెప్పుకుంటూ పోతే పెద్ద కథే…

Read More

Andhra Pradesh Deputy CM Pawan Kalyan | జనసేన విస్తరణ దిశగా పవన్ | Eeroju news

జనసేన విస్తరణ దిశగా పవన్

జనసేన విస్తరణ దిశగా పవన్ విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Andhra Pradesh Deputy CM Pawan Kalyan రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ” లైట్ ఎక్కడో ఉంటుంది.. దాని స్విచ్చు ఇంకెక్కడో ఉంటుంది”. నాయకుల స్పీచ్ గమనిస్తే యథాలాపంగా మాట్లాడిన మాటల వెనుక చాలా పెద్ద వ్యూహమే కనపడుతుంది. దానికి పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఆవు నెయ్యి కల్తీ దగ్గర మొదలైన రచ్చ పవన్ సనాతన ధర్మం కోసం తమిళంలో నిప్పులు చెరిగిన వరకు చేరుకుంది. సనాతన ధర్మ బోర్ట్ అనీ ధర్మ పరిరక్షణ అనీ పవన్ చాలా అంశాల మీదే మాట్లాడినా అసలు టార్గెట్ మాత్రం తమిళ రాజకీయ చిత్రమే అని అర్థమయిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. పవన్ కల్యాణ్ ఎంత…

Read More

Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు

భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Chandrababu కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి…

Read More

AP News | మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే | Eeroju news

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే

మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) AP News ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారంలో వైసీపీ వ్యూహం ఏంటి? నాన్చుడు ధోరణితో వ్యవహరించాలని చూస్తుందా? శాసనమండలి చైర్మన్ ద్వారా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో టిడిపి కూటమి బలం పెరగకూడదని చూస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. ఎప్పుడో ఆగస్టులో తమ పదవులకు రాజీనామా చేస్తే ఇప్పటివరకు అవి ఆమోదం పొందలేదు. అందులో ఇద్దరు స్వయంగా మండలి చైర్మన్ మోసేన్ రాజుకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. వ్యక్తిగత సమస్యలతోనే తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఎంతవరకు…

Read More