బెజవాడలో మెట్రో అడుగులు విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి భూమిని సేకరించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్అధికారులు మరోసారి భూసేకరణ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దాదాపు 90 ఎకరాల భూమి అవసరమని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంబందించి ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పీఎన్ బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్ బీఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు.మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమనే…
Read More