విడుదల రజనీ అడ్డంగా బుక్కైనట్టేనా గుంటూరు, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్కను సార్ అంటూ..పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన ఆమె అనతికాలంలో..అందలమెక్కారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి..గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజిని. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా..అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడే రజినిపై తీవ్రస్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక చిలుకలూరిపేటలో రజిని కరప్షన్ ఫైల్స్ బయటికి వస్తున్నాయి.చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమాని బెదిరించి మాజీ మంత్రి రజిని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా.. రజిని పిఎలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని ఆరోపించింది. రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల…
Read More