రాజమండ్రి, జూన్ 13, (న్యూస్ పల్స్) తూర్పుగోదావరి జిల్లాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల మంటకు సామాన్యుల కల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావసర వస్తువులను ధరలను చూసి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇటీవలి కురిసిన అకాల వర్షాల వల్లే కూరగాయల ధలకు రెక్కలు వచ్చాయని రైతులు, విక్రయదారులు పేర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు సామాన్యుని వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అన్న పరిస్థితి నెలకొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధరలు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.వారం క్రితం వరకూ కిలో టమాటా రూ.20 ఉండగా, ప్రస్తుతం అది మూడింతలు పెరిగి రూ.60కు చేరింది. పచ్చిమిర్చిని ముట్టుకుంటే ధర…
Read More