కాకినాడలో వలసల పక్షులు సందడి కాకినాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Tourist Place శీతాకాలం ప్రవేశంతోనే కాకినాడ జిల్లా కోరింగలో వివిధ రకాల పక్షుల సందడి వాతావరణం నెలకొంటుంది. ఆహార అన్వేషణలో భాగంగా వేల కిలోమీటర్ల దాటి ఇక్కడకు చేరుకుంటాయి ఈ అందమైన పక్షులు.. కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యం మడ అడవుల్లో ఆహారం లభించే చోట ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆరు నెలల పాటు అక్కడ ఉండి తిరిగి ఆయా దేశాలకు వెళ్తాయి.సైబీరియా, మంగోలియా, రష్యా చైనా ఒడిశాలోని మహానది, చంబల్ ప్రాంతాల నుండి విదేశీ వలస పక్షులు కోరింగ అభయారణ్యానికి చేరుకుంటాయి. ఇప్పటికి ఐ.పోలవరం మండలం బైరవ పాలేనికి ఇండియన్ స్కివర్ పక్షులు వచ్చాయి. నవంబరు నుండి మార్చి వరకు అభయారణ్యంలో 12 ప్రాంతాల్లో కనిపిస్తాయి. కోరంగిలోని హోప్ ఐలాండ్స్ కాకినాడ ఏటిమొగ,…
Read More