లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం తిరుమల, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Tirumala VIP Darsan తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం. పుట్టిన రోజు నాడు అయినా .. జీవితంలో ఏదైనా సాధించిన రోజు అయినా.. దూర ప్రాంతంలో ఉండి సొంత రాష్ట్రానికి వచ్చినా ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.అందుకే తిరుమల కొండలపై ఎప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటుంది. 300 దర్శనం టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీఐపీ దర్శన టిక్కెట్లకు అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం. అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ…
Read MoreTag: Tirumala
Tirumala | 2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా | Eeroju news
2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా తిరుమల, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Tirumala తిరుమలలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఇది ఎలా సాధ్యమనే విషయాలు పరిశీలిస్తే.. కంకణం విధానం తిరిగి అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అత్యధికులు సామాన్య భక్తులే. వీరికి పెద్దపీట వేస్తామని టీటీడీ నూతన పాలక మండలి చెబుతోంది. అయితే, రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో…
Read MoreTirumala | తిరుమలలో అన్యమత ప్రచారం… రంగంలోకి విజిలెన్స్ | Eeroju news
తిరుమలలో అన్యమత ప్రచారం… రంగంలోకి విజిలెన్స్ తిరుమల, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Tirumala తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందంటూ వదంతులు ఊపందుకున్నాయి. ఈ వదంతుల ధాటికి ఏకంగా టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందనే కోణంలో వివరాలు ఆరా తీస్తోంది.తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధం. ఈ విషయం అందరికీ తెలిసిందే కూడా. కానీ పలువురు మహిళలు తిరుమలలోని పాపవినాశనం వద్ద అన్యమత ప్రచారానికి పాల్పడినట్లు వదంతులు వ్యాపించాయి. అంతేకాదు ఏకంగా తమ దైవానికి సంబంధించిన పాటలకు సదరు మహిళలు రీల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ రీల్స్ అక్కడ చేశారా లేదా అన్నది టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలాల్సి ఉంది.పాప వినాశనం వద్ద 20 మంది వరకు అన్యమతస్తులు నిరంతరం ఉంటున్నట్లు సమాచారం. అయితే వీరికి స్థానిక ఫారెస్ట్…
Read MoreTirumala | దీర్ఘకాలిక సమస్యలపై టీటీడీ బోర్డు దృష్టి | Eeroju news
దీర్ఘకాలిక సమస్యలపై టీటీడీ బోర్డు దృష్టి తిరుమల, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అత్యంత పవిత్రమైన ఆలయం. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక ప్రదేశం. అందుకే.. తిరుమలని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఇదంతా.. తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం. అలాంటి.. తిరుమల కొండపై గత ఐదేళ్లలో జరగరానివన్నీ జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలెన్నో తీసుకున్నారని.. భక్తుల నుంచి అనేక విమర్శలు, అసహనం వ్యక్తమయ్యాయి. మొత్తంగా తిరుమలలో వ్యవస్థ అంతా దెబ్బతిందనే అభిప్రాయాలు వచ్చాయ్. వీటన్నింటికి మించి.. తిరుమల ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం.. దీనిపై చర్చ జరిగింది. మళ్లీ.. అలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవడమే కాదు.. తిరుమల పవిత్రతను కాపాడేలా…
Read MoreTirumala | తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా | Eeroju news
తిరుమలలో దళారి వ్యవస్థపై నిఘా తిరుమల, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టిటిడి పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజా…
Read MoreKetan Desai | ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం | Eeroju news
ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం తిరుమల, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Ketan Desai పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి కూడా అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సిరెడ్డికి, జనసేన పార్టీ నుంచి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదాలు వినిపిస్తున్నా. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంలో తెలుగుదేశం పార్టీ, వైసిపి పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత నాడు వైసిపి ఏర్పాటు చేసిన పాలకమండలి రద్దయింది. దీంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పాలకమండలిని ఏర్పాటు చేసింది. చైర్మన్ గా బీ ఆర్ నాయుడు…
Read MoreTirumala | తిరుమల బోర్డు ఎప్పుడు… | Eeroju news
తిరుమల బోర్డు ఎప్పుడు… తిరుమల, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Tirumala కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి…
Read MoreTirumala Controversy | తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా | Eeroju news
తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా తిరుమల, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Tirumala Controversy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం…
Read MoreAP Pensions | ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! | Eeroju news
ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! తిరుమల, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) AP Pensions కొత్త పింఛన్ల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో వైసీపీ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పింఛన్ల మంజూరు తో పాటు అనర్హుల పింఛన్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.ఏపీ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో అనార్హుల పెన్షన్లు కూడా తొలగించనున్నారు. వారికి…
Read MoreAmaravati | లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? | Eeroju news
లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? అమరావతి, Amaravati తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని, విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు. ఒక అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే, దర్యాప్తు వేగంగా జరిగే…
Read More