హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం,…
Read More