హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ కారణాలుగా చెప్పవచ్చు. తమ వర్గాల జనాభా లెక్కల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కోరిన మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇటీవల సర్వే గణాంకాలను వెల్లడించింది.ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం… తెలంగాణలో బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31% ఉన్నారు. ఏక సభ్య ఎస్సీ కమిషన్ ప్రకారం… ఎస్సీల్లోని 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ సర్వే లెక్కలు తప్పంటూ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కొట్టిపారేస్తున్నాయి.ఎస్సీ, ఎస్టీలకు 27% రిజర్వేషన్లు పోగా…మిగిలిన…
Read More