రేవ్ పార్టీలో పిల్లలు ఉంటారా హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Rave party జన్వాడలోని ఓ విల్లాలో జరిగిన పార్టీ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది.. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని పట్టుబటడం.. డ్రగ్స్ వినియోగించినట్లు ఒకరికి పాజిటివ్ తేలడంతో పోలీసులు విచారణను వేగవంతంచేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు.. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ..పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై కూడా విచారణ జరుపుతున్నారని.. మూసీ కుట్రలను బయటపెట్టినందుకే కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ పేర్కొన్నారు. అసలు పార్టీ జరిగింది ఫామ్‌హౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్తగా కట్టిన ఇల్లు అని హరీష్…
Read MoreTag: Telangana News
KTR | మా బంధువులపై కుట్రలు చేస్తున్నారు… కేటీఆర్ | Eeroju news
మా బంధువులపై కుట్రలు చేస్తున్నారు… కేటీఆర్ హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) KTR తమను రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై ఆయన ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కుట్రలతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. మూసీ కుంభకోణం, వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ బయటపెడుతోందని.. వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేకే కుట్రలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక.. మా కుటుంబ సభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలు చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. మా ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చాం. ఇలాంటి కేసులకు…
Read MoreKCR | హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం | Eeroju news
హాట్ టాపిక్ గా కేసీఆర్ మౌనం హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) KCR రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ మౌనం ఓ హాట్ టాపిక్. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ ఎక్కువగా మీడియాలో కనిపించేందుకు ఇష్టపడరు. సందర్భం వచ్చినప్పుడు..తాను మాట్లాడక తప్పదనుకున్నప్పుడు మాత్రమే ఆయన మీడియా ముందుకు వస్తారు.పార్టీ క్యాడర్‌కు బలమైన సందేశం ఇవ్వాలనుకుంటే..జోష్ నింపాలనుకుంటే సమయం, సందర్భం చూసి మాట్లాడుతారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. ఇలా దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన మౌనంగా ఉన్నా వార్తే… నోరు తెరిచినా వార్తే అనేలా సాగాయి తెలంగాణా పాలిటిక్స్. పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంగా బిఆర్ ఎస్ మారిన తర్వాత నుండి కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొంత హడావుడి చేసినా… ఆ తర్వాత మళ్లీ మౌనం దాల్చారు. రాష్ట్రంలో ఇప్పుడు…
Read MoreHyderabad Metro | సిటీ మొత్తం మెట్రో పరుగులు | Eeroju news
సిటీ మొత్తం మెట్రో పరుగులు హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Hyderabad Metro తెలంగాణ రాష్ట్ర రాజధాని లో ఇప్పటికే మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఒక్క క్షణం తీరిక లేకుండా, మెట్రో రైళ్లు నిరంతరం హైదరాబాద్ సిటీలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. విద్యార్థులు, పలు ప్రైవేట్ జాబ్ లలో రాణించేవారికి మెట్రో రైలు సదుపాయం వరమని చెప్పవచ్చు. అటువంటి మెట్రో వ్యవస్థను హైదరాబాద్ నగరంలో మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికిందంటే అది మెట్రో రైలు వ్యవస్థతోనే. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణీకులు మెట్రో రైలులో ప్రయాణం సాగిస్తున్నారంటే, నగరవాసులు ఈ సదుపాయాన్ని ఏ మేరకు…
Read MoreRevanth Reddy | కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ | Eeroju news
కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Revanth Reddy తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్లుగానే దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబు బేలింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా వేసిన స్కెచ్ సక్సెస్ అయింది. తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని ఇటీవల సియోల్ పర్యటనలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి చర్చనీయాంశమయ్యాయి. అందరూ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించి అరెస్టలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రేవంత్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వేసిన ఎత్తుగడ ఫలించింది. జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ…
Read MoreGold Rate | రూ.80 వేలు దాటిన తులం బంగారం | Eeroju news
రూ.80 వేలు దాటిన తులం బంగారం హైదరాబాద్ అక్టోబర్ 28 Gold Rate పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. Gold prices | షాకిస్తున్న బంగారం ధరలు | Eeroju news
Read MoreCM Revanth Reddy | జాతీయ క్రీడలపై రేవంత్ దృష్టి | Eeroju news
జాతీయ క్రీడలపై రేవంత్ దృష్టి హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) CM Revanth Reddy రాబోయే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. అందుకు సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగానకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.దీనిపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. అందులో ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రూపొందించబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో బెస్ట్‌గా ఉండాలన్నారు. వివిధ రంగాలకు చెందిన ఆటగాళ్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని…
Read MoreKCR | ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ | Eeroju news
ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ హైదరాబాద్ KCR బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పిన ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వైపు కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రస్తుతం అందరి చూపు పడిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలనే ఎంఐఎం ఆలోచనలు ఫలించేలా కనిపించట్లేదు. KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news
Read MoreTelangana | ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్ | Eeroju news
ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్ హైదరాబాద్ అక్టోబర్ 26 Telangana ఏఐసిసి జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హా మీ మేరకు, కులగణనను తెలంగాణ నుం చే ప్రారంభిస్తామన్న హామీని అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కెసి వేణుగోపాల్‌కు వివరించారు. Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news
Read MoreKTR | జనం నోటా ఒకటే స్లోగన్.. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. | Eeroju news
జనం నోటా ఒకటే స్లోగన్.. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. కేటీఆర్ విమర్శలు హైదరాబాద్ KTR దద్దమ్మ పాలనలో ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఈమేరకు ఎక్స్ ట్విట్టర్,లో కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుంచి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు. రైతు నుంచి మొదలు రైస్ మిల్లర్ల వరకు. కార్మికుని నుంచి మొదలు కాంట్రాక్టర్ల వరకు. టీచర్ల నుంచి మొదలు పోలీస్ కుటుంబాల వరకు, అవ్వాతాతల నుంచి మొదలు ఆడబిడ్డల వరకు. విద్యార్థుల నుంచి మొదలు విద్యావంతుల వరకు,నిరుద్యోగుల నుంచి మొదలు ఉద్యోగుల వరకు,…
Read More