హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు,…
Read MoreTag: Telangana News
టెట్ ఫలితాలు రిలీజ్ | Tet results release | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం,…
Read Moreకేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు | Revanth Reddy advice to Central Ministers | Eeroju news
హైదరాబాద్, జూన్ 10 కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు. …
Read More