– తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం… హైదరాబాద్, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) తెలంగాణ అడవులు గత కొన్నేళ్లుగా బాగా పెరగడం లేదు. థిక్ ఫారెస్ట్ అన్నది లేదు. అంతా పలుచబడి పోయాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేవలం 454 చదరపు కిలోమీటర్లలోనే పాతవిగా పరిగణించే చెట్లున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాలు, నేషనల్ పార్క్ వంటి రక్షిత ప్రాంతాలకు వెలుపల ఉన్న మిగిలిన అడవులు చాలా చిన్న చెట్లతోనే కనిపిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. పాత అడవులు క్రమంగా కనుమరుగవుతున్న విషయాన్ని రిపోర్ట్ స్పష్టంగా ప్రస్తావించింది. అంతే కాదు తెలంగాణలోని 13,480 చదరపు కిలోమీటర్ల రేంజ్ లోని రిజర్వ్ ఫారెస్ట్‌లలో చెట్ల బెరడును తీసేసి, చెట్టు మొదలులో లోపలికి కోత పెట్టి.. దాన్ని డెడ్ వుడ్ గా మార్చే…
Read More