Hyderabad:ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న:రేవంత్ రెడ్డి అసమర్థతకు, చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. . నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని కాంగ్రెస్ నిలువునా ముంచిందని విమర్శించారు. పదేళ్ల ప్రగతి రథచక్రానికి పంచర్ చేసిన బడ్జెట్ ఇదని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే బడ్జెట్ లో దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెను ముప్పులా ఉన్న 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్…
Read More