విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని అనేక సార్లు ఆరోపించారు. అసలైన వివరాలు బయట పెట్టడం లేదని గవర్నర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంత వరకూ పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయి లెక్కలను బయట పెట్టేందుకు సిద్దమయింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రతీ వారం రెండు నుంచి నాలుగువేల కోట్ల వరకూ అప్పు తీసుకు వస్తోంది. యభై రోజుల్లోనే పాతిక వేల కోట్ల వరకూ…
Read MoreTag: TDP
ఇంకో మంత్రి పదవి భర్తీ ఎప్పుడు | When will another ministerial position be filled? | Eeroju news
విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబుతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. విశాఖ లాంటి జిల్లాకు ఒక్కరే మంత్రి పదవి అని ఎవరూ ఊహించని విషయం. అయితే అదే సమయంలో విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. BJPఅయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ ఇలా అనేక మంది నేతలు కూటమి నుంచి విజయం సాధించి ఉన్నారు. అందులో మహిళ, ఎస్సీ కోటాలో ఒక్క వంగలపూడి అనిత…
Read Moreమల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…
Read More