అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్ న్యూ డిల్లీ అక్టోబర్ 7 Sunita Williams నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు.బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో కమాండర్‌గా విధులు…
Read More