RK Beach : సముద్రం ఎందుకు రంగు మారుతోంది…

sea

సముద్రం ఎందుకు రంగు మారుతోంది… విశాఖపట్టణం, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇటీవల ఏపీ తీరంలో సముద్రం రంగులు మారుస్తోంది. దీన్ని చూసిన ప్రజలు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అసలు సముద్రం రంగు ఎందుకు మారుతోందని చర్చించుకుటున్నారు. గతేడాది మధ్యలో.. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్రం ఎరుపు రంగులో కనిపించింది. ఆ తర్వాత ఇటీవల పెదజాలరిపేటలో పసుపు రంగులో కనిపించింది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఆకుపచ్చగా కనిపించింది.తరుచూ సముద్రం రంగులు మార్చడం దేనికి సంకేతం అని ప్రజలు చర్చించుకున్నారు. నీలి రంగులో…

Read More