సౌత్ కొరియాలో రేవంత్ టీమ్ హైదరాబాద్, ఆగస్టు 12 Revanth team in South Korea మెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దక్షిణకొరియాలో పెట్టుబడుల అన్వేషణలో పడ్డారు. అమెరికా పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దాదాపు 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని అంటున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో రేవంత్ విజయవంతమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కొరియన్ పర్యటన చాలా సానుకూలంగా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. LG గ్రూప్లో భాగమైన LS కార్పొరేషన్తో చర్చలు ప్రారంభించామన్నారు. ఎల్ఎస్ గ్రూప్ ఛైర్మన్ మిస్టర్ కూ జా యున్ ప్రతినిధుల బృందంతో సమావేశమైనట్టు వెల్లడించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ, బ్యాటరీల తయారీ పెట్టుబడులు సహా వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలిపారు.…
Read More