సింగరేణి కార్మికులకు భారీ నజరానా హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Singareni workers తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను దసరా బోనస్ గా ప్రకటించారు. సింగరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. ఇందులో సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయలు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సగటున ఒక్కో కార్మికుడికి 1.90లక్షలు బోనస్.. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు భట్టి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామన్నారు.అనంతరం డిప్యూటీ సీఎం…
Read MoreTag: revanth reddy
TS Electricity | ప్రజలకు భారం కానున్న కరెంట్ | Eeroju news
ప్రజలకు భారం కానున్న కరెంట్ హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) TS Electricity తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ అమలు చేస్తోంది. రుణ మాఫీ చేసింది. దసరాకు రైతుభరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి ప్రజలకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా అంటే అవుననే అంటున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. తమకు ఇప్పటికే భారీగా లోటు ఉందని, ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 1,200 కోట్లు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ 300 యూనిట్లు దాటితే స్థిర…
Read MoreRation card | అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు | Eeroju news
అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు నల్గోండ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Ration card రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కసరత్తు చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు…
Read MoreTelangana | 15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. | Eeroju news
15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి,2025, జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు….అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయితే… ఆ వాహనాలకు…
Read MoreAgrigold | అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి | Eeroju news
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి హైదరాబాద్ Agrigold అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే…
Read MoreCM Revanth | సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు | Eeroju news
సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు హైదరాబాద్ CM Revanth సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju…
Read MoreRevanth reddy | నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ | Eeroju news
నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ హైదరాబాద్ Revanth reddy కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news
Read MoreRevanth Reddy | రేవంత్ వ్యూహం | Eeroju news
రేవంత్ వ్యూహం హైదరాబాద్, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఒవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుంది.అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణమున్నట్లే.. ఒవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని…
Read MoreRevanth Reddy | రెండు గుడ్ న్యూస్ లు చెప్పిన రేవంత్ | Eeroju news
రెండు గుడ్ న్యూస్ లు చెప్పిన రేవంత్ హైదరాబాద్, ఆగస్టు 29, (న్యూస్ పల్స్) Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా.. రెండు పర్యాయాలు ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపించారు. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. డిసెంబర్‌లో రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నిలబెట్టుకున్నారు. తర్వాత రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో హామీల అమలు నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పంట రుణాల మాఫీపై దృష్టిపెట్టారు. జూలై 18 నంచి ఆగస్టు…
Read MoreRevanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news
రేవంత్ కుసపోర్ట్ గా నెట్ జన్లు హైదరాబాద్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Revanth Reddy చెరువుల పరిరక్షణ, అక్రమ కబ్జాలపై హైడ్రా పేరుతో సీఎం రేవంత్ జూలిపిస్తున్న కొరడాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. బడాబాబుల ఒత్తిళ్లకు తగ్గేదేలేదంటున్న రేవంత్‌కు.. ఎన్-కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావాల్సినంత మద్దతును కూడగట్టింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని సీఎం రేవంత్‌కు ఆయన లేఖ రాశారు. చెరువుల పరిరక్షణ, చెరువుల్లో కబ్జాలు, ఆక్రమణలు తొలగించేందుకు సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రాపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై ఎమ్మెల్యేలంతా…
Read More