రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం హైదరాబాద్ అక్టోబర్ 15 Ratan Tata దిగ్గజ పారిశ్రామివేత్త, రతన్ టాటా మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతిపట్ల నటుడు, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రతన్ మరణం దేశానికి తీరని లోటు అని, భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఆదర్శం అని ప్రశంసించారు. ఉప్పు నుంచి మొదులుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనిస్తుందన్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని పవన్ ప్రశంసించారు.భారత దేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శినికుల్లో ఆయన ఒకరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సేవలో రతన్‌ను మించిన వారు…
Read MoreTag: Ratan Tata
Ratan Tata | టాటా గ్రూప్ వారుసులెవరు.. | Eeroju news
టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్ సంస్థల పగ్గాలు ఎవరు…
Read MoreRatan Tata | రతన్ టాటా సింపుల్ ..
రతన్ టాటా సింపుల్ … ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata :దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వేల కోట్లు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించిన రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారు పేరు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణంలో జనకుని పాత్ర లాంటి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి!మీకు అవకాశాలు వస్తాయని ఎదురుచూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. రతన్ టాటా ఎలాంటి శ్రమైకజీవుడో తెలియడానికి రతన్ టాటా నోటి నుండి ఈ ఒక్క మాట చాలు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జీ టాటా మనవడు నావల్ టాటా, సునీ…
Read MoreRatan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత | Eeroju News
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని…
Read MoreRatan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… క్షేమంగానే ఉన్నా… రతన్ టాటా | Eeroju news
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు….క్షేమంగానే ఉన్నా… రతన్ టాటా ముంబై అక్టోబర్ 7 Ratan Tata ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్వస్థత వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య…
Read More