Flood in Maharashtra | మహారాష్ట్రలో కుండపోత | Eeroju news

Flood in Maharashtra

మహారాష్ట్రలో కుండపోత ముంబై, జూలై 26, (న్యూస్ పల్స్) Flood in Maharashtra మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం…! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ…. వరద బీభత్సం సృష్టించింది. ముంబై, పుణె నగరాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 24 గంటలకు భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది. ముంబై,…

Read More

The rains caused huge damage | అపార నష్టాన్ని మిగిల్చిన వానలు | Eeroju news

The rains caused huge damage

అపార నష్టాన్ని మిగిల్చిన వానలు ఏలూరు, జూలై 23 (న్యూస్ పల్స్) The rains caused huge damage ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావ‌రి జిల్లా అత‌లాకుత‌లం అయ్యాయి. పంట మున‌క‌తో రైతులు తీవ్రంగా న‌ష్టపోయారు. అలాగే తూర్పుగోదావ‌రి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. నిత్యం ప‌చ్చగా ఉండే కోన‌సీమ ప్రాంత‌మంతా నీటి ముంపులో ఉంది. కాకినాడ ప్రాంతంలో తీర ప్రాంతంలో ప్రజ‌లు స‌ముద్ర కోత‌తో ప్రజలు అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకుని భ‌యంతో ఉన్నారు. రాజ‌మండ్రి ప్రాంతంలోని క‌డియం వంటి ప్రాంతాల్లో రోడ్లన్ని వాగుల‌ను త‌ల‌పిస్తున్నాయి. న‌ర్సరీలు, ఉద్యాన పంట‌లు నీటిలోనే ఉన్నాయి. అలాగే వ‌రి పొలాల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయికోన‌సీమ ప్రాంతంలో పంట‌లు నీట మునిగాయి. ప‌ల్లపు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉండ్రాజ‌వ‌రం ఎర్ర కాలువ నీరు గ‌ట్లు…

Read More

Heavy rains in Chintoor | చింతూరు లో భారీ వర్షాలు | Eeroju news

Heavy rains in Chintoor

చింతూరు లో భారీ వర్షాలు చింతూరు Heavy rains in Chintoor అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్నవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు భారీగా అంతర్గత రహదారులపైకి చేరి ప్రవహిస్తుండడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 65 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూనవరం మండలం, కొండ్రాజుపేట కాజ్ వే పైకి వరదనీరు చేరడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్ పురం మండలం, అన్నవరం వాగు వంతెన పై ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మండల కేంద్రం నుండి సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామగిరి గ్రామంలో వర్షపు వరద నీరు నివాసాలలోకి వచ్చి చేరడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఎటపాక మండలం, గౌరీదేవిపేట, నల్లకుంట గ్రామాల మధ్య వరదనీరు చేరడంతో సుమారు 5…

Read More

Torrential rain in Delhi | ఢిల్లీలో కుండపోత వర్షం | Eeroju news

Torrential rain in Delhi

ఢిల్లీలో కుండపోత వర్షం న్యూఢిల్లీ Torrential rain in Delhi దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హస్తినలో పరిస్థి తులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి.  పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.     Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news

Read More

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

హైదరాబాద్ జూన్ 14 తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని ఎపి వాతావరణ శాఖ చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

Read More