హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) వేసవి సెలవులు తర్వాత తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. ముఖ్యంగా తరగతి గదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు.తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫామ్‌లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని స్కూల్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు. అయితే ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. 19 వరకు జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇక స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర ఉన్నతాధికారులుంటారు. స్కూల్స్ పరిధిలో చేపట్టే ప్రతీ పనిని…
Read More