పెద్దపల్లి రైతులు ఫామ్ ఆయిల్ పంట ద్వారా అధిక లాభం పొందవచ్చని, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, విదేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి లో జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రొచ్చహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబందించిన విత్తనాలు, మలేషియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీ గా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు.…
Read MoreTag: Peddapally
ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు | Actions are taken to have sports period and library for students every day in schools | Eeroju news
-పాఠశాల గేట్ ఏర్పాటుకు 50 వేల రూపాయల చెక్కు అందజేత -పాఠశాలకు విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలి -విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో రాజీపడవద్దు -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాఘవాపూర్ వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ప్రతినిధి: ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యా యులకు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ…
Read More