కాకినాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) పవన్ సినిమాలు చేయరా? ఫుల్ టైం రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇదే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కు చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పర్యావరణం, అటవీ శాఖ బాధ్యతలను పవన్ కు అప్పగించారు. ఆపై డిప్యూటీ సీఎం. పవన్ కు దక్కిన శాఖలన్నీ కీలకమే. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలి. రివ్యూలు జరపాలి. అందుకే ఇప్పుడు పవన్ సినీ కెరీర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పెండింగ్ సినిమాలు పూర్తి చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కీలక శాఖలను ఎలా నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోందిసంక్రాంతి నుంచి పవన్ సినిమాలు ముందుకు కదల్లేదు. వారాహి యాత్రతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొన్నారు. దీంతో…
Read MoreTag: pawan kalyan
పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news
విజయవాడ, జూన్ 15,(న్యూస్ పల్స్) జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం…
Read Moreబాబు, పవన్ చిత్రపటాలకు పాలభిషేకం | Palabhishekam for the pictures of Babu and Pawan | Eeroju news
అవనిగడ్డ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విళయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేయడంతో అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ లో డీఎస్సీ నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు…
Read Moreప్రమాణల వేళ….అనుబంధాల కోవెల… | At the time of swearing… | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం లో బలమైన బంధాలు, భావోద్వేగాలు వెలుగు చూశాయి. సమాజానికి అవసరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నందమూరి, నారా, కొణిదెల కుటుంబాలు బలమైన ముద్రను చాటుకున్నాయి. తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలను ప్రతిబింబించాయి. సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేశాయి. అందరినీ దూరం చేసుకుంటూ జగన్ అపజయాన్ని మూట కట్టుకోగా.. అందర్నీ కలుపుకొని, అన్ని కుటుంబాలు ఏకమై విజయాన్ని అందుకున్నాయి. విజయాన్ని ఆస్వాదించాయి. ప్రమాణ స్వీకారం మహోత్సవం అసాంతం కుటుంబ విలువలు తెలిపేలా దృశ్యాలు కనిపించాయి.ప్రమాణ స్వీకార వేదిక పైకి వచ్చిన నారా భువనేశ్వరిని సోదరుడు నందమూరి బాలకృష్ణ నుదుటిపై ముద్దు పెట్టి తనలో ఉన్న ఆప్యాయతను చూపించారు. అన్న దీవెనలను ఆమె సంతోషంగా స్వీకరించారు. దానిని ప్రతి ఒక్కరూ చూసి సంతోషించారు. చంద్రబాబు, నారా…
Read Moreచిరూ పవర్ చూపించిన పవన్ | Pawan who showed Chiru power | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన సాగించారు జగన్. 151 సీట్లతో గెలిచేసరికి విజయ గర్వంతో ఊగిపోయారు. తన ప్రతి నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తారని భావించారు. తన మాటకు ఎదురు తిరగరని అంచనా వేశారు. అమరావతి ఏకైక రాజధానికి అందరూ ఆమోదముద్ర వేస్తే.. తాను మాత్రం మూడు రాజధానులు అంటూ విభిన్నంగా ఆలోచించారు.అందుకే 166 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అమరావతికి జై కొట్టారు. మూడు రాజధానులు వద్దు అంటూ తేల్చి చెప్పారు. చివరకు రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజల సైతం తిరస్కరించారు. విశాఖ నగరవాసులు కనీసం ఆహ్వానించలేదు. పైగా భారీ ఓటమితో బదులు చెప్పారు.అధికారంలో ఉండగా అన్ని అనుకూలతలు కనిపిస్తాయి. ప్రధాని మోదీ ఆహ్వానిస్తారు. అవకాశం ఇచ్చారు. కూర్చోబెట్టి చర్చించారు. చాలా రకాల మినహాయింపులు ఇచ్చారు. అది ఒక దేశ…
Read Moreపెద్దిరెడ్డి పని పడతారా… | Peddireddy will work… | Eeroju news
తిరుపతి, జూన్ 13, (న్యూస్ పల్స్) అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
Read Moreఏపీకి సూపర్ ఛాన్స్ | Super chance for AP | Eeroju news
విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణస్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడం ఖాయం. ప్రమాణం చేసిన 24 మంది రేపటి నుంచి తమ విధుల్లోకి వెళ్ళనున్నారు. కొత్త పాలన ప్రారంభించనున్నారు. జనసేన తరఫున ముగ్గురు, బిజెపి తరఫున ఒక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 17 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో కనిపిస్తున్నది యువ రక్తమే. అందుకే ప్రమాణ స్వీకారం సైతం ఉత్సాహంగా సాగిపోయింది. ఈ…
Read Moreపవన్ సలహాలపై చర్చ | Discussion on Pawan’s suggestions | Eeroju news
గుంటూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్..వెండితెరపై జనసేనానికి ఉన్న పేరు ఇది. అయితే ఇప్పుడా హీరోను రియల్ హీరో చేశారు ప్రజలు. తన చేతికి నిజమైన పవర్‌ను అందించారు. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పవన్ తన పవర్‌ను ఎలా ఉపయోగించబోతున్నారు. పగలు, ప్రతికార రాజకీయాలకు కేరాఫ్ అయిన ఏపీ పాలిటిక్స్‌లో.. పవన్ మార్పు తీసుకొస్తారా? దీనికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి?ఒకసారి చేస్తే తప్పు.. పదే పదే జరిగితే అది అలవాటు.. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అంటారు. వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకపోతే ఇంకొకరు. పాలించేవారు మారుతారు. బట్ పాలించే విధానం మాత్రం మారదు. ఇదే ఏపీ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారు ఎవరైనా చెప్పే మాట.. కానీ ఇకపై అలా ఎవ్వరూ అనుకునే అవకాశం ఇవ్వొద్దు అంటున్నారు. జనసేన అధినేత…
Read Moreచిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం | Chiranjeevi and Pawan held hands and saluted the people of Modi | Eeroju news
అమరావతి జూన్ 12 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.
Read Moreచంద్రబాబు తర్వాత పవన్, తర్వాత లోకేష్ | After Chandrababu, Pawan, then Lokesh | Eeroju news
విజయవాడ, జూన్ 12, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే… సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. సభకు వచ్చిన వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సభలో అడుగుపెట్టీ పెట్టగానే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్… ముందు ప్రజారాజ్యం బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో 2014లో జనసేన పేరుతో పార్టీ పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు. 2014…
Read More