గుంటూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్..వెండితెరపై జనసేనానికి ఉన్న పేరు ఇది. అయితే ఇప్పుడా హీరోను రియల్ హీరో చేశారు ప్రజలు. తన చేతికి నిజమైన పవర్‌ను అందించారు. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పవన్ తన పవర్‌ను ఎలా ఉపయోగించబోతున్నారు. పగలు, ప్రతికార రాజకీయాలకు కేరాఫ్ అయిన ఏపీ పాలిటిక్స్‌లో.. పవన్ మార్పు తీసుకొస్తారా? దీనికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి?ఒకసారి చేస్తే తప్పు.. పదే పదే జరిగితే అది అలవాటు.. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అంటారు. వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకపోతే ఇంకొకరు. పాలించేవారు మారుతారు. బట్ పాలించే విధానం మాత్రం మారదు. ఇదే ఏపీ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారు ఎవరైనా చెప్పే మాట.. కానీ ఇకపై అలా ఎవ్వరూ అనుకునే అవకాశం ఇవ్వొద్దు అంటున్నారు. జనసేన అధినేత…
Read MoreTag: pawan kalyan
చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం | Chiranjeevi and Pawan held hands and saluted the people of Modi | Eeroju news
అమరావతి జూన్ 12 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.
Read Moreచంద్రబాబు తర్వాత పవన్, తర్వాత లోకేష్ | After Chandrababu, Pawan, then Lokesh | Eeroju news
విజయవాడ, జూన్ 12, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే… సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. సభకు వచ్చిన వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సభలో అడుగుపెట్టీ పెట్టగానే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్… ముందు ప్రజారాజ్యం బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో 2014లో జనసేన పేరుతో పార్టీ పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు. 2014…
Read Moreమరి జనసేన సీఎం ఎప్పుడు | And when Jana Sena CM | Eeroju news
కాకినాడ, జూన్ 12, (న్యూస్ పల్స్) ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం రాజకీయంగా కూడా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా ఈసారి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ను ఫామ్ చేయడంలో తను కీలకపాత్ర వహించాడు. ఇక 2019 ఎలక్షన్స్ లో ఒకే ఒక్క సీట్ ని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం 21 ఎమ్మెల్యే స్థానాలను, రెండు ఎంపీ స్థానాలను గెలిచి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే చంద్ర బాబు నాయుడుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇక ఇది చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు అంటూ పలు రకాల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.…
Read More