Diwali | ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ | Eeroju news

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Diwali ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి. అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు…

Read More

Election Commission | ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ | Eeroju news

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Election Commission భారతదేశంలో మరో మినీ ఎన్నికల సమరానికి వేళ అయ్యంది. దేశంలోనే జీఎస్డీపీ, జీడీపీలో నెంబర్ వన్ గా ఉన్న మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ ప్రసంగాలు, నేతల ప్రచారాలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో వేడి వాతావరణం సంతరించుకోనుంది.ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ వారం ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక వచ్చే నెలలో అంటే నవంబర్‌ రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ…

Read More

Delhi | డిల్లీలో రద్దీ ట్యాక్స్… | Eeroju news

డిల్లీలో రద్దీ ట్యాక్స్...

డిల్లీలో రద్దీ ట్యాక్స్… న్యూఢిల్లీ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Delhi దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ప్రజలు చాలా కాలంగా రద్దీ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పరిష్కారం దక్కలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ‘ట్యాక్స్’ ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ‘దిల్లీ కంజెషన్ ట్యాక్స్’ ప్రకారం.. రద్దీ సమయంలో, ఎంపిక చేసిన రోడ్డు మీద మీరు ప్రయాణిస్తే అదనంగా- కొత్త ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది! ఇలా చేస్తే, ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ సమయాల్లో నిర్దేశిత రహదారులను ఉపయోగించినందుకు డ్రైవర్లకు ఛార్జీలు వసూలు చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నామని రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ షహజాద్ ఆలం తెలిపారు.రవాణా నిర్వహణకు కొత్త…

Read More

Arvind Kejriwal | ఆప్ కు కలిసిరాని హర్యానా | Eeroju news

ఆప్ కు కలిసిరాని హర్యానా

ఆప్ కు కలిసిరాని హర్యానా న్యూఢిల్లీ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Arvind Kejriwal కాంగ్రెస్ కంటే ముందు హర్యానాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. హర్యానా లో అధికారంలోకి రావాలని భావించిన ఆయన.. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హర్యానాకు పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉంది. కానీ అదే మ్యాజిక్ ను హర్యానాలో కంటిన్యూ చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హర్యానాలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఓటమికి అనేక…

Read More

BJP | ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… | Eeroju news

భారతీయ జనతా పార్టీ నాయకత్వం

ఓటమి నుంచి కోలుకుని… తిరుగు లేని స్థాయికి… ఛండీఘడ్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) BJP పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్రమైన అంతర్మథనం లో పడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలను ప్రకటించాయిఅయితే వీటన్నింటిని పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి త్వరగా కోలుకుంది. వేగంగా పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సామాజిక ఇంజనీరింగ్ నుంచి ఎన్నికల వ్యూహాల వరకు.. అన్నింటికీ పదును పెట్టి..…

Read More

cement prices | భారీగా పెరిగిన సిమెంట్ ధరలు | Eeroju news

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు ముంబై, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) cement prices దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు తిరోగమించాయి. దీంతో, సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగి, సిమెంట్‌ ధరలు కూడా పెరిగాయి.ఈ ఏడాది, నైరుతి రుతపవనాల వల్ల దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. ఆ ప్రత్యక్ష ప్రభావం నిర్మాణ కార్యకలాపాలపై పడింది. సాధారణంగానే వర్షాకాలంలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల మరింత స్లో అయ్యాయి. ఇప్పుడు, మాన్‌సూన్‌ సీజన్‌ ముగియడంతో దేశంలో నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా నివాస గృహాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అపార్ట్‌మెంట్లు, రహదారులు, కర్మాగారాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు వంటివి చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఫలితంగా సిమెంట్‌కు…

Read More

Isha Foundation | ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక… | Eeroju news

ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక...

ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక… కోయంబత్తూరు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Isha Foundation ఈషా ఫౌండేషన్‌.. ఆధ్యాత్మిక భావాలు ఉన్న హిందువే కాదు. వివిధ మతాలవారు, విదేశీయులకు కూడా ఈ ఫౌండేషన్‌ గురించి తెలుసు. తమిళనాడులోని ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యోగాతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్‌ 1992లో ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో సద్గురు(జగదీష్‌ వాసుదేవ్‌) దీనిని స్థాపించారు. ఈషా యోగా కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వలంటీర్లే దీనిని నిర్వహిస్తున్నారు. నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగిరి శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంతో ఉంది. ఇది ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ వంటి యోగా అన్ని విభాగాలను ఒకే గొడుగు క్రింద…

Read More

Teachers | దారి తప్పుతున్న టీచర్లు… | Eeroju news

దారి తప్పుతున్న టీచర్లు...

దారి తప్పుతున్న టీచర్లు… అనంతపురం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Teachers చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అప్పులు చేసి జనానికి పంగ నామం పెట్టి పరారతున్నారు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు ఉపాధ్యాయులు… తల్లిదండ్రులు పిల్లల్ని చక్క బెడతారో లేదో తెలియదు కానీ.. ఎంతో మంది పిల్లలకు చక్కటి చదువులు చెప్పి…

Read More

Supreme Court | సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం | Eeroju news

సుప్రీం కోర్టు తీర్పుతో... వైసీపీలో మోదం

సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం న్యూఢిల్లీ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Supreme Court తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరింది. సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సిట్ నియమించారు. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నైతిక బలాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకూ తమ వాదన ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారాలేవని ప్రశ్నించిందని.. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో వైసీపీ కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు…

Read More

Germany | ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు | Eeroju news

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు శ్రీకాళహస్తి సెప్టెంబర్ 26 Germany శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం పరదేశీయులు సందడి చేశారు. సంప్రదాయ దుస్తులతో జర్మనీ దేశానికి చెందిన 56 మంది బృందంగా ముక్కంటి శుని దర్శనం కోసం తరలివచ్చారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆలయంలో రద్దీ ఉన్నప్పటికీ వీళ్లకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యస్వామి, స్వామి అమ్మ వార్ల తో పాటు శని భగవానుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు ఇక్కడి ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్ప కళ ల ను చూసి ఆత్మానందాన్ని పొందారు. వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడి ఆలయాన్ని…

Read More