దీపావళికి సూర్య వర్సెస్ విక్రమ్ చెన్నై, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Surya vs Vikram తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కమల్ హాసన్, రజినీకాంత్ లకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్లిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలను చేస్తున్నందుకు గాను వాళ్ళు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో నిరాశపరిచినప్పటికి మరోసారి భారతీయుడు 3 సినిమాని లైన్ లో పెడుతూన్నాడు. అలాగే రజనీకాంత్ కూడా రీసెంట్ గా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.…
Read MoreTag: News
India | వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా | Eeroju news
వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా ముంబై, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) India భారత్ మారుతోంది. ఒకప్పుడు ఎన్నో దిగుమతులు.. ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే. మేకిన్ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. ప్రధాని మోదీ కలలు సాకారమవుతుండడంతో పాటు.. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. 2014లో ప్రతిష్టాత్మకంగా మేకిన్ ఇండియాను లాంచ్ చేశారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో టాప్ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు కలలు కన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది. 2014లో దేశంలో 80శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పుడు 99.9శాతం మొబైల్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు.. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, సౌతాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. డిఫెన్స్ ప్రొడక్షన్‌తోపాటు.. అంతరిక్షం,…
Read MoreTamannaah Bhatia | తమన్నా జైలు తప్పదా… | Eeroju news
తమన్నా జైలు తప్పదా… కోహినూరు, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Tamannaah Bhatia హెచ్‌పీజడ్ క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ క్రోర్ స్కాం జరిగినప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున లాభాలు వస్తాయని..బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని ప్రచారం చేసుకున్న HPZ టోకెన్ అనే సంస్థ మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై మొదట నాగాలాండ్ లో కేసు నమోదు అయింది. హెచ్‌పీజడ్ టోకెన్ సంస్థ ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసి అసలు లేని క్రిప్టో కరెన్సీ మైనింగ్ మెషిన్స్ మీద పెట్టుబడి పెట్టాలని ప్రజల్ని నమ్మించింది. ఈ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే తమన్నా భాటియాను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. అయితే తమన్నా ఈ స్కాంలో నేరుగా ఎక్కడా పాల్గొనలేద.…
Read MoreThreatening calls | 3 రోజులు… 15 బెదిరింపు కాల్స్ | Eeroju news
3 రోజులు… 15 బెదిరింపు కాల్స్ ముంబై, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) Threatening calls బాంబు పెట్టాం.. పేల్చిపారేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి..! అంటూ ఒక అజ్ఞాతవాసి నుంచి బెదిరింపు స్వరం. తీరాచూస్తే అంతా తూచ్. ఇదీ వరస. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్లన్న తేడా లేదు. ఉత్తుత్తి బెదిరింపులతో వేలాదిమంది ప్యాసింజర్లు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు గుప్పిట పట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి. అటు.. ఏవియేషన్ యంత్రాంగానిక్కూడా చుక్కలు కనిపించాయి. గత మూడు రోజుల్లోనే మొత్తం 15 బాంబ్ థ్రెట్స్ నమోదయ్యాయి. అక్టోబర్ 16, బుధవారం.. ఈ ఒక్కరోజులోనే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. కాకపోతే అన్నీ ఫేకే..! అందరూ క్షేమం. మూడు ఇండిగో, రెండు స్పైస్‌జెట్.. ఒకటి ఆకాశ ఎయిర్.. మొత్తం ఆరు ప్లేన్లలో ప్రయాణికుల్ని బెంబేలెత్తించాయి బోగస్ ఫోన్‌కాల్స్.ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అగంతకుల…
Read MoreSheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ | Eeroju news
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ న్యూ డిల్లీ అక్టోబర్ 18 Sheikh Hasina బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆమె నివాసంపై దాడి చేస్తారని తెలుసుకున్న హసీనా రహస్యంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ లో దేశం వడిచి భారత్ కు వచ్చి తలదాచుకుంటోంది. దీంతో హసీనా ప్రభుత్వం అర్థాంతరంగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉన్నారు. దేశ పాలనను చేతుల్లోకి బంగ్లా ఆర్మీ.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అనంతరం నోబెల్ విజేత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది.…
Read MoreHaryana Assembly Elections 2024 | హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం | Eeroju news
హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా అక్టోబర్ 18 Haryana Assembly Elections 2024 హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సైనీతో సీఎంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. గురువారం వేడుకగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎపి సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ శిండే, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడోసారి బిజెపి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ |…
Read MorePredator drones | భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు | Eeroju news
భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు న్యూఢిల్లీ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Predator drones ప్రిడేటర్ డ్రోన్లు చాలా సామర్థ్యం కలిగినవి. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు ఈ ప్రెడెటర్ డ్రోన్లు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ భూమిలో సమాచారం ప్రాణవాయువు లాంటిది. కచ్చితమైన టార్గెట్ ను ఎంచుకుని దాడి చేయడానికి సహకరించడంతోపాటు.. ఆయుధాల వృథాను అరికడుతాయి. తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్లు దేశ సరిహద్దుల్లో భారత్‌కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు.. హిమాలయ శిఖరాల్లో మన సైన్యానికి కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. ఇప్పటికే చైనా వద్ద చియాహాంగ్-4, వింగ్‌లంగ్-2.. దాయాది దేశం పాకిస్థాన్ వద్ద షహపర్-2, వింగ్‌లంగ్-2, బైరక్తర్ టీబీ2 వంటి డ్రోన్‌లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి యూఏవీలులేవు. కానీ, ప్రస్తుత ప్రెడేటర్ల రాకతో, వద్ద…
Read MoreAllu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం | Eeroju news
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం Allu Arjun సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇలా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు. అందుకు అల్లు అర్జున్ అభిమానులతో ఎంతో ప్రేమగా వుండటమే కారణం. ఇక పుష్ప-2 చిత్రంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారారు. పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ ఆయన మేనరిజం స్వాగ్‌కు అందరూ పడిపోయారు. ఇలా అల్లు…
Read MorePriyanka | వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక | Eeroju news
వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక న్యూఢిల్లీ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) Priyanka మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందిఈసారి కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో…
Read MoreCEC Rajeev Kumar | ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. | Eeroju news
ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్.. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…
Read More