ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… ఆ జాబితాలో చేరిన మహారాష్ట్ర ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) States దేశంలోనే మహారాష్ట్ర ఒక్క రాష్ట్రమే కాదు.. ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు భారీ మెజారిటీతో విజయాన్ని నమోదు చేశాయి. మహారాష్ట్ర రాజీకాయాలు గత అయిదు సంవత్సరాలుగా థ్రిల్లర్ సినిమాకు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కొన్ని తేలని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా తలపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం వార్ వన్ సైడే అన్నట్లు వెలువడ్డాయి. అధికార మహాయుతి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ కూటమిలో బిజేపీ, అజిత్…
Read MoreTag: News
Chandrababu Naidu KCR Jagan Revanth Reddy | పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… | Eeroju news
పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Chandrababu Naidu KCR Jagan Revanth Reddy ఒకప్పుడు పాద యాత్ర చేసిన నేతలు సీఎం అవుతారు అన్న సెంటిమెంట్ ఉండేది. రెండు దశాబ్దాలుగా.. అరెస్టు అయితే సీఎం అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరూపితమవుతోంది.రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇందు కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం ద్వారా, మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ప్రజలు పార్టీలను గెలిపిస్తారు. అయితే 2004 నుంచి ట్రెండ్ మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాదయాత్ర సెంటిమెంట్‌గా…
Read MorePawan Kalyan | ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ | Eeroju news
ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ న్యూఢిల్లీ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయానికి కారణాలేమిటన్నదానిపై అందరూ రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.అందరూ ఓ కారణం చెబుతున్నారు. అదేమిటంటే ఎన్డీఏ నేతల ప్రచారం. మహారాష్ట్రతో సంంబధం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ లాంటి ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు.చంద్రబాబు రెండు రోజుల ప్రచారం ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. కానీ ప్రచారానికి మాత్రం సిద్దమయ్యారు. ఇలా కలసికట్టుగా ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇక ముందు ఇదే ట్రెండ్ కొనసాగించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా వెనుకబడిపోతోంది. గత మూడు సార్లు అరవింద్…
Read MoreChina | చైనా బోర్డర్ వరకు ట్రైన్ | Eeroju news
చైనా బోర్డర్ వరకు ట్రైన్ ఇటానగర్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) China భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్‌గఢ్ – బాగేశ్వర్‌కు చేరుకుంటుంది.ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్‌గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.…
Read MoreModi | మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. | Eeroju news
మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. న్యూఢిల్లీ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Modi కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వార్థంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఏడాది క్రితం కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హత్య ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ నాడే ఖండించింది. సాక్షాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా.. తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి.. భారత రాయబారులను విచారణ చేసేందుకు సిద్ధమైంది. వెంటనే అప్రమత్తమైన భారత్.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. భారత్‌లోని కెనడా రాయబారులను ఇక్కడి నుంచి బహిష్కరించింది. దీంతో దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో…
Read MoreBSNL | బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు | Eeroju news
బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు ముంబై, నవంబర్ 22, (న్యూస్ పల్స్) BSNL టారిఫ్‌లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను చూస్తుంటే, జియో, ఎయిర్ టెల్, ఐడియా కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ లాభపడుతోంది. సెప్టెంబరు నెలలో టెలికాం కంపెనీలు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారతీ ఎయిర్‌టెల్ 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, వోడాఫోన్ ఐడియా 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో భారీ నష్టాలను…
Read MoreRation cards | 5 కోట్ల రేషన్ కార్డులు రద్దు | Eeroju news
5 కోట్ల రేషన్ కార్డులు రద్దు న్యూఢిల్లీ, నవంబర్ 21, (న్యూస్ పల్స్): Ration cards ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్, ఈ కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను కేంద్రం తొలగించింది. అయితే ఇప్పటివరకు దాము 80.6 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నామని స్పష్టం చేసింది. ఆహార భద్రత విషయంలో ప్రపంచానికే బెంచ్ మార్క్ లాగా నిలిచామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసామని వివరించింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానం ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రజలకు రేషన్ తీసుకుని అవకాశాన్ని కల్పించామని కేంద్రం పేర్కొంది. “కోవిడ్ కాలంలో దేశ ప్రజలకు ఉచితంగా బియ్యం ఇవ్వడాన్ని ప్రారంభించాం. కోవిడ్ ముగిసిపోయినప్పటికీ దానిని…
Read MoreAP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
ఢిల్లీకి చంద్రబాబు న్యూఢిల్లీ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CM ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు , ఏడీబి రుణాలపై సంతకాలు జరిగాయి. ముందస్తుగా పనులు ప్రారంభించడానికి అవసరమైన అడ్వాన్సులను విడుదల చేయాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం ఇటీవల పలు రకాల నిధులు, పెట్టుబడుల ప్రకటనలు చేసింది. వాటిని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని…
Read MorePakistan | పాకిస్తాన్ లో పెట్రో బాంబు… | Eeroju news
పాకిస్తాన్ లో పెట్రో బాంబు… లాహోర్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Pakistan పాకిస్థాన్ ద్రవ్యోల్బణం బంధంలోకి జారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది అక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా ఇటీవల పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం కారణంగా లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, హెచ్‌ఎస్‌డి ధరలు బ్యారెల్‌కు సుమారు 1.7డాలర్లు, 4.4డాలర్ల మేర పెరిగాయి. ఇది కాకుండా, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు దాదాపు 1డాలర్ పెరిగి బ్యారెల్‌కు 9.80డాలర్లకి చేరుకుంది. అయితే హెచ్ఎస్డీ లో ఈ ప్రీమియం బ్యారెల్‌కు 5డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉంది.అంతకుముందు అక్టోబర్ 31న ప్రభుత్వం…
Read MoreOnion rates hike | ఉల్లి… లొల్లి… | Eeroju news
ఉల్లి… లొల్లి… ముంబై, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Onion rates hike కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు…
Read More