PM Modi- Xi Jinping | ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ | Eeroju news

ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ

ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు.. ఢిల్లీ, PM Modi- Xi Jinping భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం అక్టోబర్ 23, కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గతంలో 11 అక్టోబర్ 2019న ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తాజాగా రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ తమ మొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

Supreme Court | మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే | Eeroju news

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే న్యూఢిల్లీ అక్టోబర్ 21 Supreme Court మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపి, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. యూపి ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ జామియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి. పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు…

Read More

Indian Railways | ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు | Eeroju news

ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు

ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు న్యూఢిల్లీ అక్టోబర్ 18 Indian Railways ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైమును మార్చింది. ఇదివరలో 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు దానిని 60 రోజులకు కుదించింది. కాగా దీని ప్రభావం నేడు ఐఆర్ సిటిసి షేర్ ట్రేడింగ్ మీద పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 2.2 శాతం పడిపోయి రూ. 867.60 వద్ద ఒక్కో షేరు ట్రేడయింది.ఇండియన్ రైల్వే వారి కొత్త రూల్ 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ నవంబర్ 1 కన్నా ముందుగా కొన్న టికెట్లకు ఈ కొత్త రూల్ వర్తించదు. 2024-25లో భారత రైల్వేస్ 7.5 బిలియన్ల మంది ప్యాసంజర్లను రవాణా చేసింది. అది గత…

Read More

Sheikh Hasina | బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ | Eeroju news

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ న్యూ డిల్లీ అక్టోబర్ 18 Sheikh Hasina బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరో షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆమె నివాసంపై దాడి చేస్తారని తెలుసుకున్న హసీనా రహస్యంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ లో దేశం వడిచి భారత్ కు వచ్చి తలదాచుకుంటోంది. దీంతో హసీనా ప్రభుత్వం అర్థాంతరంగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉన్నారు. దేశ పాలనను చేతుల్లోకి బంగ్లా ఆర్మీ.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అనంతరం నోబెల్ విజేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్‌ హసీనాను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది.…

Read More

Predator drones | భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్‌ డ్రోన్లు | Eeroju news

భారత్ అమ్ములపొదిలోకి...ప్రిడేటర్‌ డ్రోన్లు

భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్‌ డ్రోన్లు న్యూఢిల్లీ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Predator drones ప్రిడేటర్‌ డ్రోన్లు చాలా సామర్థ్యం కలిగినవి. అటు ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణతో పాటు ఈ ప్రెడెటర్ డ్రోన్లు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ భూమిలో సమాచారం ప్రాణవాయువు లాంటిది. కచ్చితమైన టార్గెట్ ను ఎంచుకుని దాడి చేయడానికి సహకరించడంతోపాటు.. ఆయుధాల వృథాను అరికడుతాయి. తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్లు దేశ సరిహద్దుల్లో భారత్‌కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు.. హిమాలయ శిఖరాల్లో మన సైన్యానికి కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. ఇప్పటికే చైనా వద్ద చియాహాంగ్-4, వింగ్‌లంగ్-2.. దాయాది దేశం పాకిస్థాన్ వద్ద షహపర్-2, వింగ్‌లంగ్-2, బైరక్తర్ టీబీ2 వంటి డ్రోన్‌లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి యూఏవీలులేవు. కానీ, ప్రస్తుత ప్రెడేటర్ల రాకతో, వద్ద…

Read More

Priyanka | వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక | Eeroju news

వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక

వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక న్యూఢిల్లీ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) Priyanka మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందిఈసారి కాంగ్రెస్‌ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో…

Read More

CEC Rajeev Kumar | ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. | Eeroju news

ట్యాంపరింగ్ సాధ్యం కాదు..

ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్   న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్‌ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్‌ నేత రషీద్‌ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్‌.. కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…

Read More

Diwali | ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ | Eeroju news

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్

ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Diwali ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి. అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు…

Read More

Election Commission | ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ | Eeroju news

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Election Commission భారతదేశంలో మరో మినీ ఎన్నికల సమరానికి వేళ అయ్యంది. దేశంలోనే జీఎస్డీపీ, జీడీపీలో నెంబర్ వన్ గా ఉన్న మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ ప్రసంగాలు, నేతల ప్రచారాలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో వేడి వాతావరణం సంతరించుకోనుంది.ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ వారం ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక వచ్చే నెలలో అంటే నవంబర్‌ రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ…

Read More

Delhi | డిల్లీలో రద్దీ ట్యాక్స్… | Eeroju news

డిల్లీలో రద్దీ ట్యాక్స్...

డిల్లీలో రద్దీ ట్యాక్స్… న్యూఢిల్లీ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Delhi దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ప్రజలు చాలా కాలంగా రద్దీ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పరిష్కారం దక్కలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ‘ట్యాక్స్’ ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ‘దిల్లీ కంజెషన్ ట్యాక్స్’ ప్రకారం.. రద్దీ సమయంలో, ఎంపిక చేసిన రోడ్డు మీద మీరు ప్రయాణిస్తే అదనంగా- కొత్త ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది! ఇలా చేస్తే, ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ సమయాల్లో నిర్దేశిత రహదారులను ఉపయోగించినందుకు డ్రైవర్లకు ఛార్జీలు వసూలు చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నామని రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ షహజాద్ ఆలం తెలిపారు.రవాణా నిర్వహణకు కొత్త…

Read More