ఏపీలో సోషల్ మీడియా వార్… నెల్లూరు, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Social Media War In AP ఏపీలో సోషల్ మీడియా వార్ పీక్ లెవల్‌లో కొనసాగుతోంది. అటు టీడీపీ..ఇటు వైసీపీ వరుస పెట్టి..పోటాపోటీ పోస్టర్లు, ట్వీట్లతో బ్లాస్టింగ్ న్యూస్ అంటూ ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ టీమ్ చంద్రబాబు, లోకేశ్‌ను టార్గెట్ చేస్తే టీడీపీ సోషల్ మీడియా..జగన్‌ను, ఆయన కోటరీని రౌండప్ చేస్తోంది. దీంతో పోటాపోటీ పోస్టులు, ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎన్నికలు అయిపోయాయి. టీడీపీ పవర్‌లోకి వచ్చి ఐదు నెలలు కావొస్తోంది. మళ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకో నాలుగేళ్లు అయితే పడుతుంది. కానీ ఏపీలో మాత్రం రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ హీటెక్కుతోంది. పవర్‌లో ఉన్న టీడీపీ..అపోజిషన్‌లో ఉన్న వైసీపీ ఎవరూ తగ్గడం లేదు. అధినేత…
Read MoreTag: Nellore
AP New Liquor Policy | ఏపీలో కిక్కే కిక్కు | Eeroju news
ఏపీలో కిక్కే కిక్కు నెల్లూరు, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) AP New Liquor Policy కొత్త సీసా..కొత్త మందు..తగ్గిన రేటు. ఇక కిక్కే కిక్కు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మందు బాబులకే కాదు..లిక్కర్ వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా మంచిరోజులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో టేస్ట్ లేని మందు..నోటితో పలకలేని బ్రాండ్లు చూసి చిర్రెత్తిపోయిన మందుబాబులు..ఇప్పుడు లో కాస్ట్‌కే ప్రీమియం లిక్కర్‌ను తాగి ఎంజాయ్ చేస్తున్నారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులకు కూడా మంచిగానే బిజినెస్ అవుతోంది. ఇక ప్రభుత్వానికి టెండర్ ఫీజ్ నుంచి సేల్స్ వరకు ఖజానాలో కాసులు వచ్చి పడుతూనే ఉన్నాయి. కొత్త లిక్కర్ షాపులు తెరుచుకుని వారం రోజులే అయింది. ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్ జరుగుతున్నాయి. ఏకంగా ఆరు వందల కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఇలా తెరుచకున్నాయో…
Read MoreThalli Vandanam | జనవరి నుంచి తల్లి వందనం | Eeroju news
జనవరి నుంచి తల్లి వందనం నెల్లూరు, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Thalli Vandanam ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు వేయనున్నారు.…
Read MoreYS Jagan vs Anil Kumar | అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. | Eeroju news
అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. నెల్లూరు, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan vs Anil Kumar సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. వరుసగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను మారుస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇప్పటి దాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని నెల్లూరు సిటీ ఇన్చార్జ్‌గా షిఫ్ట్ చేశారు. దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా తయారైంది. రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చవి చూశాక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. రానున్న కాలంలో…
Read MoreIs YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news
బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Read MorePrime Minister Narendra Modi | 6న ఏపీకి మోడీ | Eeroju news
6న ఏపీకి మోడీ నెల్లూరు, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) Prime Minister Narendra Modi ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 6న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రావడం ఇది రెండోసారి.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో పరిశ్రమలతో…
Read MoreSecretariats | గ్రామ సచివాలయ సిబ్బంది కుదింపు | Eeroju news
గ్రామ సచివాలయ సిబ్బంది కుదింపు నెల్లూరు, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Secretariats ఏపీలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కూడా ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం…వీరిలో కొంత మందికి సరైన విధులు లేవని అభిప్రాయపడింది. అటువంటి వారిని మండల, డివిజన్ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో నియమించాలనే ఆలోచన…
Read MoreGazette for Jagan | జగన్ కోసమే గెజిట్… | Eeroju news
జగన్ కోసమే గెజిట్… నెల్లూరు, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) Gazette for Jagan ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రయివేటు సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశమిచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతు మాత్రం విధించింది. 2014 – 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు నిరాకరిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కీలక కేసులను అయితే తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు అనుమతించినప్పటికీ…
Read MoreChief Minister Chandrababu Naidu | అధికారుల్లో దడ… | Eeroju news
అధికారుల్లో దడ……. నెల్లూరు, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Chief Minister Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దడ లేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్ అధికారుల్లో ఉంది. 2014 లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు అసలు పొంతనే లేదు. పూర్తిగా వయొలెంట్ గా మారిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 1995 నాటి ముఖ్యమంత్రిని నేడు చూస్తారంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. బీకేర్‌ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు అంటుండటంతో వణికిపోతున్నారుచంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు ఆయన దూకుడుగా వెళ్లారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులను నిద్ర పోనివ్వ లేదు. దీంతో పాటు సస్పెన్షన్లు కూడా నాడు ఎక్కువ…
Read More7 thousand people retired in one day… | ఒక్క రోజే 7 వేల మంది రిటైర్మెంట్… | Eeroju news
ఒక్క రోజే 7 వేల మంది రిటైర్మెంట్… నెల్లూరు, ఆగస్టు 2(న్యూస్ పల్స్) 7 thousand people retired in one day… జులై 31 ఒక్క రోజులోనే దాదాపు ఏడు వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం రెండేళ్ల నిర్బంధ సర్వీస్ పొడిగింపు అమలు చేశారు. ఉద్యోగులు స్వచ్ఛంధ పదవీ విరమణ చేసినా రెండేళ్ల తర్వాతే పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని నిబంధన విధించారు. జులై 31 కావడంతో ఒకేసారి భారీగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. గత జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణ మొదలైనా ఇంత భారీ సంఖ్యలో రిటైర్మెంట్‌లు కావడం ఇదే తొలిసారి. 2022లో తీవ్ర ఆర్థిక…
Read More