నీట్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు న్యూఢిల్లీ, జూలై 11 (న్యూస్ పల్స్) NEET Counseling arrangements నీట్ యూజీ కౌన్సిలింగ్ జులై మూడో వారంలో నిర్వహిస్తామని, తిరిగి పరీక్షను నిర్వహించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. నీట్లో అక్రమాలు, అవకతకలు జరిగినట్టు దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన మర్నాడే కేంద్రం తన నిర్ణయం వెల్లడించడం గమనార్హం. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం వాస్తవమేనని, పరీక్ష సమగ్రతను దెబ్బతీశారని నిర్దారణ అయినా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా తిరిగి తాము పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఫలితాల సమగ్ర విశ్లేషణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరగలేదని లేదా స్థానిక అభ్యర్థులు లబ్ధిపొందినట్లు ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో…
Read More