సీఎం చెప్పినా వినరా_కనిపించని ఆన్ లైన్ సేవలు అనంతపురం, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్) ఏపీలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి, ధృవ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా పౌరసేవల్లో మాత్రం మార్పు రావడం లేదు.డిజిటల్ పౌరసేవల్లో దేశానికే ఒకప్పుడు తలమానికంగా వ్యవహరించిన రాష్ట్రంలో ఇప్పడు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలవరీ వ్యవస్థ పడకేసింది. గ్రామ వార్డు సచివాలయాలతో పౌరసేవల్ని అందించిన తర్వాత కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు పరిస్థితి తయారైంది.వాట్సాప్‌లోనే ప్రజలు నేరుగా డిజిటల్ ధృవీకరణలు పొందేలా టెక్నాలజీని అభిృవృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా పౌర సేవల్లో నాణ్యత మాత్రం మెరుగు పడటం లేదు. రెవిన్యూ శాఖ ద్వారా అందించే పౌర సేవల్ని…
Read More