కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. టీడీపీకి కార్యకర్తలే బలం, బలగం. ప్రాణసమానమైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మైలవరం నియోజకవర్గంలో 66,369 సభ్యత్వాల నమోదు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మైలవరం టీడీపీ కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చరిత్ర సృష్టించారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినప్పుడు ఒక్కరితో ఆరంభమైన ప్రయాణం నేడు కోటి మందికి పైగా కుటుంబ సభ్యులతో వర్ధిల్లుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 52 వేల 598 సభ్యత్వములు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో కూడా 66,369 మంది సభ్యత్వములు నమోదు చేసుకున్నారని…
Read More