పవన్ సభలకు పోటెత్తున్న జనం ముంబై, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan kalyan జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజుల ప్రచారానికి వెళ్లారు. తొలి రోజు మూడు సభల్లో ప్రసంగించారు. తెలుగు మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇంచార్జులుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడ పని చేసుకుంటున్నారు. నాందేడ్ కు విష్ణువర్ధన్ రెడ్డి.. మరఠ్వాడాకు మధుకర్ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇంచార్జులుగా ఉన్న చోటనే పవన్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏపీ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలు కొద్దిగా మరాఠీతో పాటు తెలుగులోనే సాగాయి. పవన్ ప్రసంగాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.పవన్…
Read MoreTag: Mumbai
Chandra Babu | చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు | Eeroju news
చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు ముంబై, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Chandra Babu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్రలో కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో తన కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఏపీకి నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు…
Read MoreFlood in Maharashtra | మహారాష్ట్రలో కుండపోత | Eeroju news
మహారాష్ట్రలో కుండపోత ముంబై, జూలై 26, (న్యూస్ పల్స్) Flood in Maharashtra మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం…! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ…. వరద బీభత్సం సృష్టించింది. ముంబై, పుణె నగరాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 24 గంటలకు భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది. ముంబై,…
Read MoreAnant’s wedding cost 5 thousand crores | అనంత్ పెళ్లి ఖర్చు 5 వేల కోట్లు… | Eeroju news
అనంత్ పెళ్లి ఖర్చు 5 వేల కోట్లు… ముంబై, జూలై 13, (న్యూస్ పల్స్) Anant’s wedding cost 5 thousand crores అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు సెలెబ్రిటీలంతా తరలివస్తున్నారు. ఇండియాలో ఎవ్వరూ చూడని స్థాయిలో చాలా గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్ జరుగుతోంది. ఈ పెళ్లి గురించి భారత్‌లోనే కాదు. ప్రపంచ దేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు పలు దేశాల రాజకీయ నేతలకి, అంతర్జాతీయంగా ఉన్న బడా వ్యాపారులకు ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీనీ ఆహ్వానించింది. ఈ గెస్ట్ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన వాళ్లూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు అంబానీ ఈ పెళ్లి కోసం చేస్తున్న ఖర్చు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే…
Read MoreIAS Pooja dismissal from service | ఐఏఎస్ పూజా… సర్వీస్ నుంచి తొలగింపు | Eeroju news
ఐఏఎస్ పూజా… సర్వీస్ నుంచి తొలగింపు ముంబై, జూలై 13, (న్యూస్ పల్స్) IAS Pooja dismissal from service ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులో చూస్తున్నాయి. పూజా ఖేద్కర్ కుటుంబసభ్యులు కూడా గతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె తల్లి మనోరమ గతంలో అనేక అరాచకాలకు పాల్పడిన విషయాలు బయటకొచ్చాయి. మనోరమ తల్లి గతంలో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియోలు అందరినీ షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. కొందరు గ్రామస్థులను మనోరమ చిన్న రివాల్వర్‌తో బెదిరించారు. వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. చేతిలో తుపాకీ పట్టుకొని గ్రామస్థుల దగ్గరకు వెళ్లిన పూజా ఖేద్కర్ తల్లి.. వారితో దురుసుగా వ్యవహరించింది. తన పేరిట ఆ భూమి పత్రాలు ఉన్నాయని మనోరమ వాదించింది. తనకు రూల్స్ చెప్పొద్దని వారికి రైతులకు…
Read More