రహదారి భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బాన్స్ వాడ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం బాన్సువాడ పట్టణంలో పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్టు ధరించాలని సూచించారు. ప్రస్తుతం జరిగే రోడ్డు ప్రమాదాల్లో మానవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. రహదారి భద్రతపై విద్యార్థులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ శెట్కర్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కలెక్టర్…
Read More