మావోలపై ముప్పేట దాడి…. హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) వరుస ఎన్ కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఏరివేత లో భాగంగా ఎన్ కౌంటర్ లు నిత్యకృతయమయ్యాయి. ఒక ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. నిన్న ఆదివారం ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా. మృతుల్లో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ…
Read More