కధువా… జల్లెడ పడుతున్న భద్రతా దళాలు | Kadhua… Sifting security forces | Eeroju news

శ్రీనగర్, జూన్ 13, (న్యూస్ పల్స్) జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. రియాసీలో బస్సుపై ఉగ్రదాడి తర్వాత వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సైతం ధీటుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికీ వెళ్లి మంచినీళ్లు అడుగుతున్నారు.అయితే, అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే తలుపులు వేసుకుని, అధికారులను అప్రమత్తం చేశారని పోలీసు అధికారి తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో కనీసం ఒక ఉగ్రవాది మరణించారు. మరో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం కథువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు, భద్రతా బలగాలపై…

Read More