KCR : కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే

kaleshwaram project

– కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే హైదరాబాద్, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలన్నది అప్పటి సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని, మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల ఎంపిక కూడా ఆయనదేనని రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు చేసిన కేటాయింపులతో పాటు సప్లిమెంటరీ పేరుతో నిధులు విడుదలయ్యేవన్నారు. భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులు కష్టసాధ్యం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగగర ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం జరిగిందని, నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఇచ్చిన…

Read More