కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్ కాకినాడ, నవంబర్ 29, (న్యూస్ Pawan Kalyan గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల…
Read MoreTag: kakinada
Pawan Kalyan | జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? | Eeroju news
జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? కాకినాడ, విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Pawan Kalyan జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌లో…
Read MoreKakinada | రియల్..సింగం తరహాలో కాకినాడ కలెక్టర్ సాహసాలు | Eeroju news
రియల్..సింగం తరహాలో కాకినాడ కలెక్టర్ సాహసాలు కాకినాడ, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Kakinada నీతి, నిజాయితీగా పనిచేస్తే ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎవరిరైనా ప్రశ్నించే అధికారం అధికారులకు ఉంటుంది. కానీ నిందితులు తెలివి మీరిపోయారు. టెక్నాలజీ వాడి ఏదో రూపంలో తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వస్తుంది. సరిగ్గా కాకినాడలో అలాంటి ఘటనే జరిగింది. సముద్ర మార్గంలో షిప్ ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కలెక్టర్ అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి పడవలో వెళ్లి మరీ అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.సింగం సినిమాలో హీరో సూర్య సముద్రంలోకి వెళ్లి ఛేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి సైతం నిందితుడి ఆటకట్టించడం సినిమా చూసిన వారికి గుర్తుంటుంది. రియల్…
Read MoreMudragada Padmanabham | ముద్రగడ కు కలిసి రాని కాలం | Eeroju news
ముద్రగడ కు కలిసి రాని కాలం కాకినాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Mudragada Padmanabham ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లును చవి చూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజల మన్ననలను పొందగలిగారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆయనను సొంత సామాజికవర్గం నమ్మలేదు. ఆయన మాటలను విశ్వసించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వైరమే ఆయనను కాపులకు దూరం చేసిందని చెప్పాలి.పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఆయన పనిచేయడమే కాకుండా కాపు రిజర్వేషన్లు తాను అమలు చేయనని చెప్పిన జగన్ పార్టీ పంచన చేరడం కూడా ముద్రగడకు మైనస్ గా…
Read MoreTourist Place | కాకినాడలో వలసల పక్షులు సందడి | Eeroju news
కాకినాడలో వలసల పక్షులు సందడి కాకినాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Tourist Place శీతాకాలం ప్రవేశంతోనే కాకినాడ జిల్లా కోరింగలో వివిధ రకాల పక్షుల సందడి వాతావరణం నెలకొంటుంది. ఆహార అన్వేషణలో భాగంగా వేల కిలోమీటర్ల దాటి ఇక్కడకు చేరుకుంటాయి ఈ అందమైన పక్షులు.. కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యం మడ అడవుల్లో ఆహారం లభించే చోట ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆరు నెలల పాటు అక్కడ ఉండి తిరిగి ఆయా దేశాలకు వెళ్తాయి.సైబీరియా, మంగోలియా, రష్యా చైనా ఒడిశాలోని మహానది, చంబల్ ప్రాంతాల నుండి విదేశీ వలస పక్షులు కోరింగ అభయారణ్యానికి చేరుకుంటాయి. ఇప్పటికి ఐ.పోలవరం మండలం బైరవ పాలేనికి ఇండియన్ స్కివర్ పక్షులు వచ్చాయి. నవంబరు నుండి మార్చి వరకు అభయారణ్యంలో 12 ప్రాంతాల్లో కనిపిస్తాయి. కోరంగిలోని హోప్ ఐలాండ్స్ కాకినాడ ఏటిమొగ,…
Read MoreRice ATM | ఏపీలో రైస్ ఏటీఎంలు | Eeroju news
ఏపీలో రైస్ ఏటీఎంలు కాకినాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Rice ATM సాంకేతికతను మరింతగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న రైస్ ఏటీఎంల విధానం ఇక్కడకూడా అమలు చేయాలని చూస్తోంది. రైస్ ఏటీఎంలు ఏర్పాటు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకునే వీలు కలుగుతుంది. అంతే కాకుండా రేషన్ దుకాణాల్లో క్యూలైన్లు లేకుండా కూడా చూడొచ్చు. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. పనికి వెళ్లే వాళ్లు తమ పనులు మానుకొని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అక్రమాలకు చెక్ పెట్టే వీలు ఉంటుంది. ఈ రైస్ ఏటీఎంలకు అనుగుణంగా ఉండేలా రేషన్…
Read MorePithapuram | పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం | Eeroju news
పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం కాకినాడ, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Pithapuram ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. ఎన్నికల సమయంలో..పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ అన్నారు. ఈ మాట మేరకు జులైలో పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో గతంలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు.ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్…
Read MorePawan kalyan | పవన్ హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏమిటీ | Eeroju news
పవన్ హాట్ కామెంట్స్ ఆంతర్యం ఏమిటీ కాకినాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Pawan kalyan డిప్యూటీ సీఎంగా ఉంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పవన్ బహిరంగంగా హోం మంత్రికి.. పోలీసులకు సూచనలు చేస్తూనే వార్నింగ్ ఇచ్చారు.ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఆమె రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అసలు పవన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం టీడీపీ నేతలకు అంతుపట్టడం లేదు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయంటే.. అవి ఊరికే అనాలోచితంగా రావు.…
Read MoreRamachepa | రామచేప రేటే వేరప్పా…. | Eeroju news
రామచేప రేటే వేరప్పా…. కాకినాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Ramachepa పులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతం. పల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే.. ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7…
Read MoreRegistration Charges | డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు | Eeroju news
డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు కాకినాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Registration Charges ఏపీలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సాధారణంగా పట్టణాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తుంటారు. తాజాగా కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని నిర్ణయించింది. భూముల బహిరంగ మార్కెట్ విలువ, స్థానిక అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర…
Read More