కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న – భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు. అందర్నీ కలుస్తానని వివరించారు. జగన్ చెప్పిన తీరుతో కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల…
Read More