నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.. Read:Vijayawada:కాక రేపుతున్న అమిత్ షా టూర్
Read More