హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది.
Read MoreTag: Hyderabad
ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ..? | Phone tapping case ED entry..? | Eeroju news
హైదరాబాద్ తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా.? ఈ కేసు వివరాలను ఈడి అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారా.? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణ కు ఈడి వచ్చే అవకాశం ఉందా.? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దీంతో ఈడి రాక ఖాయం అనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధా కిషన్ రావు ఆయన బృందంలోని అనేకమంది పోలీస్ అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టడంతో పాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల విచారణ…
Read Moreరేవ్ పార్టీ నటి హేమకు బెయిల్ | Bail for rave party actress Hema | Eeroju news
హైదరాబాద్ ప్రతినిధి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం సీసీబీ, న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Read More25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్ రావు.. | 25 thousand teacher posts should be filled : Harish Rao.. | Eeroju news
హైదరాబాద్ 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనఊరు- మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.
Read Moreజీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం | Minister Ponnam Prabhakar is angry with GHMC officials | Eeroju news
హైదరాబ్నాద్ జూన్ 12 జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం జీహచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని జీహచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. ముందస్తు చర్యలపై అధికారుల సమాధానంపై పొన్నం అసహనం వ్యక్తం చేశారు.వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయని అధికారులు ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ అధ్వన్నంగా ఉందని.. అధిక సంఖ్యలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నిలదీశారు. నగరంలో సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు.
Read Moreపెరిగిన ఆర్టీసీ బస్సు టిక్కెట్లు | Increased RTC bus tickets | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు,…
Read Moreటెట్ ఫలితాలు రిలీజ్ | Tet results release | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం,…
Read Moreమల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…
Read More