రుణమాఫీపై కొత్త గైడ్ లైన్స్… | New guidelines on loan waiver… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని గత కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో రుణమాఫీపై రేవంత్ సర్కార్…గట్టిగా ఫోకస్ చేసే పనిలో పడింది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో… ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కటాఫ్ తేదీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన…

Read More

విస్తరణకు రెడీ… భారమంతా అధిష్టానంపైనే | Ready for expansion… all the burden is on the head | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయి. ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగానే ఉంచారు. అనేక శాఖలను పలువురు మంత్రులు చూస్తున్నారు. ఇది వారికి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈసారి వారికి అవకాశమివ్వాలని నిర్ణయించారని తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయిన రేవంత్ ఈ మేరకు విస్తరణకు సంబంధించిన హామీని పొందినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో…

Read More

మహిళా శక్తి పథకం..ఆరంభం | Mahila Shakti Scheme..start | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎస్. ఇప్పటికే, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్…

Read More

జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం | Cabinet sub-committee meeting on Geo 317 | Eeroju news

దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 30వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్ జూన్ 13 జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం  సమావేశ మైంది.ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు .  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.  ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది.  ఈ సమావేశంలో వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం…

Read More

రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం | Cabinet meeting to finalize the procedures for the implementation of farmer loan waiver | Eeroju news

 హైదరాబాద్ రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి. వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం.. అందుబాటులో ఉన్న వనరులు, నిధుల…

Read More

రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్..? బుక్స్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు | Break for the distribution of textbooks across the state..? The education department orders to take back the book | Eeroju news

హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది.

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ..? | Phone tapping case ED entry..? | Eeroju news

హైదరాబాద్  తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా.? ఈ కేసు వివరాలను ఈడి అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారా.? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణ కు ఈడి వచ్చే అవకాశం ఉందా.? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దీంతో ఈడి రాక ఖాయం అనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధా కిషన్ రావు ఆయన బృందంలోని అనేకమంది పోలీస్ అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టడంతో పాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల  విచారణ…

Read More

రేవ్ పార్టీ నటి హేమకు బెయిల్ | Bail for rave party actress Hema | Eeroju news

హైదరాబాద్ ప్రతినిధి, బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది.ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం సీసీబీ, న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Read More

25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్ రావు.. | 25 thousand teacher posts should be filled : Harish Rao.. | Eeroju news

హైదరాబాద్ 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనఊరు- మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.

Read More

జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం | Minister Ponnam Prabhakar is angry with GHMC officials | Eeroju news

హైదరాబ్నాద్ జూన్ 12 జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం జీహచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని జీహచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. ముందస్తు చర్యలపై అధికారుల సమాధానంపై పొన్నం అసహనం వ్యక్తం చేశారు.వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయని అధికారులు ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ అధ్వన్నంగా ఉందని.. అధిక సంఖ్యలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నిలదీశారు. నగరంలో సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు.

Read More