హెచ్ఎండీఏలో కొత్త జోన్లు హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) New zones in HMDA హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీపడుతూ దూసుకువెళ్లుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తన పోటీ పక్క రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక పోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాలు, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది. హెచ్ఎండీఏలో కొత్త జోన్లను ఏర్పాటు చేసింది. గతంలో నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు వాటిని ఆరుకు పెంచింది. ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ ప్రాంతం 7,200 చదరపు కీలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, త్వరలోనే రిజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మొత్తం హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హెచ్ఎండీఏలో…
Read MoreTag: Hyderabad
Loan waivers for MLAs | ఎమ్మెల్యేలకు రుణమాఫీలు.. | Eeroju news
ఎమ్మెల్యేలకు రుణమాఫీలు.. సోషల్ మీడియాలో వైరల్ హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Loan waivers for MLAs వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు కావాల్సినవి వస్తాయి అంటారు. ఇప్పుడు రుణమాఫీ సంగతి కూడా అలాగే ఉంది. అనర్హులంటూ రైతులకు రుణ మాఫీని దూరం చేస్తున్న రేవంత్ సర్కార్.. అయిన వారికి మాత్రం పైసా నష్టం లేకుండా చేస్తుంది. రుణమాఫీలో పేదోడి పొట్టగొడుతూ పెద్దోళ్ల గల్లాలు నింపుతోంది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కాలేదని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, పార్టీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి తన విశాల హృదయాన్ని చాటుకుంది రేవంత్ సర్కార్. పేదల పక్షం అని చెప్పుకోవడం తప్ప చేతల్లో మాత్రం ఏం లేదన్న విమర్శలకు నిదర్శనంగా నిలుస్తోంది. బడా బాబులకు రుణమాఫీ చేస్తూ.. చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తోంది.…
Read MoreRevanth fires on KTR’s comments | కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్ | Eeroju news
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 20 Revanth fires on KTR’s comments సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే… తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా… సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ…
Read MoreKavitha’s case postponed again | కవిత కేసు మళ్లీ వాయిదా | Eeroju news
కవిత కేసు మళ్లీ వాయిదా హైదరాబాద్, ఆగస్టు 20 Kavitha’s case postponed again ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కోరిన ఈడీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ మరికొంత సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కవితను అకారణంగా ఐదు నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడిన నేపథ్యంలో ఆ రోజున కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని…
Read MoreColonies turned into ponds | చెరువులుగా మారిన కాలనీలు | Eeroju news
చెరువులుగా మారిన కాలనీలు హైదరాబాద్, ఆగస్టు20 Colonies turned into ponds హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలాలు పొంగి… మహానగరంలోని రోడ్లను చెరువులుగా మార్చాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. మొన్న (ఆదివారం) రాత్రి కుండపోత కురిసింది… సోమవారం ఉదయానికి వర్షం తగ్గినట్టే తగ్గి… భారీ దంచికొట్టింది. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి… హైదరాబాద్ అల్లకల్లోలమైంది. ప్రధాన మార్గాలన్నీ… వరద నీటితో నిండిపోయాయి. దీంతో… వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కుప్పకూలింది. ఈ దెబ్బకు పార్కింగ్ చేసిన వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. షేక్‌పేట్ మార్గం… ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద.. ఇరువైపులా వరద నీరు చేరడంతో.. ఆ మార్గాలు మూసేశారు.…
Read MoreHeavy rain in Secunderabad | సికింద్రాబాద్ లో భారీ వర్షం | Eeroju news
సికింద్రాబాద్ లో భారీ వర్షం తప్పని అవస్థలు సికింద్రాబాద్ Heavy rain in Secunderabad రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బేగంపేట, రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్,సీతాపల్ మండి, బౌద్ధ నగర్,అడ్డగుట్ట తోపాటు కంటోన్మెంట్ మారేడ్ పల్లి, కార్ఖనా, .బోయిన్ పల్లి, తిరుమల గిరి పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట, బ్రాహ్మణ వాడి,, ప్రకాష్ నగర్, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్..నాలా బజార్ మోకాళ్ళ లోతు వరకు వచ్చిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వల్లనే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని మోండామార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్టు కార్పొరేటర్ అన్నారు ఇకనైనా జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రాపాలి దృష్టి సారించి ఎమర్జెన్సీ…
Read MoreA rose study on regional parties | ప్రాంతీయ పార్టీలపై గులాబీ అధ్యయనం | Eeroju news
ప్రాంతీయ పార్టీలపై గులాబీ అధ్యయనం హైదరాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) A rose study on regional parties పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం డీఎంకే బాటలో నడవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం.. వచ్చే నెలలో చెన్నై పర్యటించనుంది. బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పర్యటన చేయాలని గులాబీ నేతలు నిర్ణయించారు. పార్టీని మరింత పటిష్ఠం చేయడం కోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలిస్తోంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న (డీఎంకే) ద్రవిడ మున్నేట్ర కజగం నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. తమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కావడంతో.. ఆ…
Read MoreParts of RTC buses that are blowing away | ఊడిపోతున్న ఆర్టీసీ బస్సుల భాగాలు.. | Eeroju news
ఊడిపోతున్న ఆర్టీసీ బస్సుల భాగాలు.. నిజామాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Parts of RTC buses that are blowing away ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. బస్సు ఎక్కగానే మనకు పెద్ద పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్ కనిపిస్తుంది. కానీ.. ఇటీవల జరుగుతున్న ఘటనలతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా.. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే బస్సు పార్టులు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టీజీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులకు సంబంధించి తరుచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. ఇటీవల బస్సు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయన ఘటన మరువకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బస్సు రన్నింగ్‌లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. TS 31 Z…
Read MoreIn Telangana too bulldozer politics | తెలంగాణలోనూ..బుల్డోజర్ పాలిటిక్స్ | Eeroju news
తెలంగాణలోనూ..బుల్డోజర్ పాలిటిక్స్ హైదరాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) In Telangana too bulldozer politics ఉత్తర ప్రదేశ్ లో అన్యాయాలకు పాల్పడిన వారిపై, అక్రమాలు చేసిన వారిపై, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ ప్రయోగించారు. బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి చెందారు. యోగి మార్క్ బుల్డోజర్ న్యాయం పై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. తీవ్రంగా దుయ్య బట్టింది. కానీ ఇప్పుడు అదే మార్క్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వస్తోంది. వెనుకటి రోజుల్లో అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించాలంటే భయపడేవారు. ఎదుటివారి ఆస్తులను తమ పేరు మీద అక్రమంగా బదిలీ చేయించుకోవాలంటే వణికే వారు. చివరికి చెరువుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. నాలాల వైపు చూపు కూడా తిప్పే వారు కాదు. కానీ ఇప్పుడు అలా…
Read MoreBala Sadan girls who tied rakhis to the collector | కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు | Eeroju news
కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు సిద్దిపేట Bala Sadan girls who tied rakhis to the collector రాఖి పౌర్ణమి పండగ సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం బాలసదనం చిన్నారులతో సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనం బాలికలు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రతి ఒక చిన్నారి రాఖీ కట్టగా జిల్లా కలెక్టర్ చాలా సంతోషించి ప్రతి ఒక చిన్నారికి స్వయంగా స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. వారితో కాసేపు సంభాషించి ఎలా చదువుకుంటున్నారు అని, రాఖీ పండుగ సందర్భంగా ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను…
Read More