Hyderabad | తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు | Eeroju news

తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు

తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad ప్రస్తుతం ఉన్న శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా.. మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వరంగల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మరో 3 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యామైన అంశాలు ఇలా ఉన్నాయి. 1.ఇటీవల జరిగిన వరంగల్‌ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2.ప్రభుత్వం తీసుకున్న చర్యలతో…

Read More

Pawan Kalyan | ఎన్డీయే వారియర్ గా పవన్ | Eeroju news

ఎన్డీయే వారియర్ గా పవన్

ఎన్డీయే వారియర్ గా పవన్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Pawan Kalyan బీజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుందని భావించింది. 300 పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మిత్రులతో కలిసి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. కానీ 240 సీట్లు వద్ద బిజెపి బలం ఆగిపోయింది. మిత్రుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి 16, నితీష్ నేతృత్వంలోని జెడియు 12 స్థానాలతో ఆదుకున్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే.. బలం తగ్గిందన్న బాధ బిజెపి పెద్దలను వెంటాడింది. అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పదని సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో విజయం…

Read More

Revanth Reddy | రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా | Eeroju news

రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా

రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా రేవంత్ ప్రచారం చేసినా ప్చ్… లాభం లేదు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revanth Reddy మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినచోట మంచి ఫలితాలు రాగా.. రేవంత్ ప్రచారం చేసి చోట కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి ఘ‌న విజ‌యాన్ని సాధించింది.…

Read More

Telangana | 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ | Eeroju news

29న బీఆర్ఎస్ దీక్షా దివస్

29న బీఆర్ఎస్ దీక్షా దివస్ హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Telangana ఈనెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించాలని.. కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రను ఎవరూ చేరిపేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి.. తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు అని స్పష్టం చేశారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని…

Read More

Hyderabad Real Estate | మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం | Eeroju news

మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం

మళ్లీ పెరిగిన రియల్ వ్యాపారం హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Hyderabad Real Estate హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. అక్టోబర్‌లో హైదరాబాద్ లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని, రియల్ ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనిపించిందని ఈ సంస్థ సర్వే రిపోర్టు తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం 5,985 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించారు. రూ. 3,617 కోట్ల గృహాల అమ్మకాలు జరిగాయని సర్వే తెలిపింది. హైదరాబాద్ నగరంలో నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఏడాదికి 14 శాతం పెరుగుదల నమోదు అవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. ఆగస్టు,…

Read More

Kavitha | కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… | Eeroju news

కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా...

కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… లిట్మస్ టెస్ట్ లో ఫెయిలా… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌ గురుకుల‌లో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. దీంతో క‌విత‌క్క ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి త‌మ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే క‌విత రీఎంట్రీ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ పెంచినా అన్న కేటీఆర్ కు మాత్రం పోటు త‌ప్ప‌ద‌నే వార్తలు గుప్పుమంటున్నాయి.రాష్ట్రంలో…

Read More

Chandrababu Naidu KCR Jagan Revanth Reddy | పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… | Eeroju news

Chandrababu Naidu KCR Jagan Revanth Reddy

పాదయాత్రల ట్రెండింగ్ పోయి… అరెస్ట్ ల ట్రెండింగ్… హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Chandrababu Naidu KCR Jagan Revanth Reddy ఒకప్పుడు పాద యాత్ర చేసిన నేతలు సీఎం అవుతారు అన్న సెంటిమెంట్‌ ఉండేది. రెండు దశాబ్దాలుగా.. అరెస్టు అయితే సీఎం అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరూపితమవుతోంది.రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇందు కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం ద్వారా, మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ప్రజలు పార్టీలను గెలిపిస్తారు. అయితే 2004 నుంచి ట్రెండ్‌ మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాదయాత్ర సెంటిమెంట్‌గా…

Read More

Telangana | కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ | Eeroju news

కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్

కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్   Telangana   బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్లపై నిరాధార ఆరోపణలు చేసినందుకే తనను కోర్టులో హాజరుపరిచినట్లు సృజన్ రెడ్డి తెలిపారు. అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సృజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2011లో సోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభించామని, కందాల దీప్తిరెడ్డి సంస్థను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ…

Read More

TS Cabinet | డిసెంబర్ 9లోపే కేబినెట్ విస్తరణ | Eeroju news

డిసెంబర్ 9లోపే కేబినెట్ విస్తరణ

డిసెంబర్ 9లోపే కేబినెట్ విస్తరణ హైదరాబాద్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) TS Cabinet తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జరగొచ్చని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో సమావేశాల నిర్వహణ వాడీవేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావే శాల్లో నూతన రెవెన్యూ చట్ట బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. అదే రోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా కొత్త చట్టాన్ని…

Read More

Kalvakuntla Kavitha | యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత | Eeroju news

యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత

యాక్టివ్ మోడ్ లోకి కల్వకుంట్ల కవిత హైదరాబాద్, నవంబర్ 24, (న్యూస్ పల్స్) Kalvakuntla Kavitha : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లి లిక్కర్ కేసులో బెయిల్ విడుదల అయిన తరువాత పార్టీ కార్యక్రమంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేసుకున్న కవిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె వర్గీయులు అంటున్నారు. మరోవైపు ఆమె దీక్షలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అసలు ఆమె ఎందుకు కనిపించడం లేదన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ఆమె కేసు ఇంకా పూర్తికాక పోవడంతో .. భయపడుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఆ క్రమంలో ఆమె డైరెక్ట్‌గా పీఎం మోడీని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టు హాట్ టాపిక్‌గా…

Read More