రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం హైదరాబాద్ TS హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు. Conference of Governors at Rashtrapati Bhavan on 2-3 | 2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు | Eeroju news
Read MoreTag: Hyderabad
Kavitha re-entry | బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ… | Eeroju news
బతుకమ్మ నుంచి కవిత రీ ఎంట్రీ… హైదరాబాద్, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Kavitha re-entry బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత… ఇప్పటివరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కవిత… బెయిల్ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్‌గా ఉండటం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజమాబాద్‌లోనూ ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఐతే, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో విశ్రాంతికి సెలవు ప్రకటించి తనపై రాజకీయ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట కవిత.…
Read MoreRunamafi | సంపూర్ణ రుణమాఫి చేయాలి | Eeroju news
సంపూర్ణ రుణమాఫి చేయాలి హైదరాబాద్ Runamafi తెలంగాణ భవన్ అలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు ఎలా ఉందంటే ఎన్నికలపుడు గాల్లో మాటలు ,అధికారం లో గాలి మోటార్ల యాత్రలు అన్నట్టు ఉంది. శ్రీశైలం నిర్వాసితుల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. తత ప్రభుత్వాలు శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయం చేశాయని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మంది కి కేసీఆర్ ప్రభుత్వం లష్కర్లుగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది. కేసీఆర్ హాయం లో ఆరువేల లష్కర్ ఉద్యోగాలు నింపాలనుకుని అందులో శ్రీశైలం నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం జీవో కూడా ఇచ్చారు. వంత్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినా అది నెరవేరడం లేదని అన్నారు. పాలమూరు జిల్లాకు…
Read MoreOnion prices | 80కి చేరిన ఉల్లి ధరలు | Eeroju news
80కి చేరిన ఉల్లి ధరలు హైదరాబాద్, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Onion prices రాష్ట్రంలో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మార్కెట్ వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.గతంలో ఉల్లి ధరలు కిలో రూ.20 వరకు పలికిన ధర.. ప్రస్తుతం నాలుగింతలకు ఎగబాకింది. దీంతో సామాన్యులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మరోవైపు వేసిన పంటలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. రానున్న కాలంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మార్కెట్‌లలో రూ. 50…
Read MoreKTR | చిక్కుల్లో కేటీఆర్ | Eeroju news
చిక్కుల్లో కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) KTR అమృత్ స్కీమ్ టెండర్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూరేలా కుట్రలు జరిగాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తరచూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఈ వివాదంపై మంత్రి పొంగులేటి స్పందించి ఖండించారు. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టెండర్ దక్కించుకున్న శోధా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇదే క్రమంలో ఆయన కుమారుడు సృజన్ రెడ్డి స్పందించి కేటీఆర్‌కు నోటీసులతో షాకిచ్చారు. అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని అందులో పేర్కొన్నారు. ఇకనైనా తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని…
Read MoreTelangana | మండుతున్న నిత్యావసరాల ధరలు | Eeroju news
మండుతున్న నిత్యావసరాల ధరలు హైదరాబాద్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) Telangana పచారీ సామాన్లకో, కాయగూరలకో సంచి పట్టుకుని బైటికెళితే.. గుండెలు బరువెక్కకుండా ఇంటికొస్తామన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఔను మరి.. కొండెక్కి చుక్కలనంటుకున్నాయి నిత్యావసరాల ధరలు. వంట నూనెలు భగ్గుమంటుంటే.. కూరగాయల ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కొత్తిమీర కొనాలన్నా యాభైనోటు బైటికి తియ్యాల్సిన పరిస్థితి. పండగ సీజన్లో మిడిల్‌క్లాసోడ్ని భయపెట్టి చంపేస్తున్నాయి తాజా ధరలు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, దిగుబడి తగ్గిపోవడం, రవాణా సమస్యలు.. అన్నీ కలిపి కూరగాయల ధరల్ని కొండెక్కేలా చేశాయి. బహిరంగ మార్కెట్లే కాదు.. రైతుబజార్లలో కూడా ఏది కొనబోయినా కొరివే. సరిగ్గా నెలరోజుల కిందట కిలో పాతిక రూపాయలకొచ్చిన టమోటా ఇప్పుడు రెండింతలై హాఫ్ సెంచరీ పలుకుతోంది. 50 నుంచి 70 రూపాయలు ఇచ్చుకుంటే తప్ప…
Read MoreAsaduddin Owaisi | తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు | Eeroju news
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు లడ్డూలో కొవ్వు కలవడం బాధాకరం హైదరాబాద్ Asaduddin Owaisi హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ.. తిరుమల లడ్డూ అంశంపై స్పందించారు. లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. Tirumala Laddu | లడ్డూ వివాదం… | Eeroju news
Read MoreHyderabad | మందుబాబు హల్ చల్ | Eeroju news
మందుబాబు హల్ చల్ హైదరాబాద్ Hyderabad డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబు హల్చల్ చేశాడు. చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ .ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆసమయంలో అక్కడికి ఆటో ను ఆపేందుకు పోలీసులు యత్నించారు. అతడి ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసుల పైకి తీసుకువెళ్ళే విధంగా ముందుకు సాగాడు. ఆటోను అపి పరీక్షించ మద్యం సేవించినట్లు నిర్దారణ ఆయి oది. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.చివరకు పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై అధ్యయనం
Read MoreEetela Break with Krishna | ఈటెలకు కృష్ణయ్యతో బ్రేక్… | Eeroju news
ఈటెలకు కృష్ణయ్యతో బ్రేక్… హైదరాబాద్, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Eetela Break with Krishna తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2020 నుంచి 2023 వరకు బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అధిష్టానం ఎన్నికల సమయంలో తప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గిందన్న వాదనలు వినిపించాయి. దీంతో అప్పటి వరకు జోష్‌గా ఎన్నికలకు సిద్ధమైన కేడర్ ఒక్కసారిగా డీలా పడింది. కిషన్‌రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. బండి సంజయ్ తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి కొత్తగా పార్టీలోచేరిన ఈటల రాజేందర్‌తోపాటు, రఘునందన్‌రావు, మరికొందరు…
Read MoreRevanth | కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్ | Eeroju news
కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్ హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Revanth తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు రెడీ అవుతున్నారు. నేతలను అందుకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలను చావుదెబ్బ తీసి సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకోసం అస్త్రశస్త్రాలను రేవంత్ సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా పథకాలను అందిచి ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలను ప్రారంభించారు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగడంపైనే చర్చ సాగుతుంది.…
Read More