Hyderabad | హైదరాబాదులో ఐటీ సోదాలు | Eeroju news

హైదరాబాదులో ఐటీ సోదాలు

హైదరాబాదులో ఐటీ సోదాలు హైదరాబాద్ Hyderabad గురువారం ఉదయం నగరంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ పై ఐటి సోదాలు జరిగాయి.   ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news

Read More

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రూ.78వేలు | Eeroju news

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రూ.78వేలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రూ.78వేలు హైదరాబాద్ అక్టోబర్ 17 Gold Rates పసిడి కొనుగోలు దారులకు మరోసారి షాకిచ్చాయి బంగారం ధరలు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. దీంతో మార్కెట్ లో తులం గోల్డ్ రూ.78వేలకు చేరువైంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముగల(తులం) బంగారం ధర రూ.450 పెరిగి రూ.71,400కు చేరుకుంది.ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ.77,890గా కొనసాగుతోంది. అయితే, కేజీ వెండిపై రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది. హైదరాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ );పసిడి…

Read More

Hyderabad | హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ | Eeroju news

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌

హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ హైదరాబాద్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Hyderabad ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. హైదరాబాద్‌ కూడా రోజురోజుకూ అదే స్థాయిలో పేరుప్రఖ్యాతలు సాధిస్తోంది. అలాగే.. అదే స్థాయిలో విస్తరిస్తోంది కూడా. పల్లెల నుంచి నిత్యం మహానగరానికి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. సిటీ జనాభా ఏటా అమాంతం పెరుగుతోంది. అయితే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జీహెచ్ఎంసీ సైతం సదుపాయాలు కల్పిస్తోంది. సరికొత్త పద్ధతులను అవలంబిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు రాకుండా వినూత్న ప్రయోగాలకు దిగుతోంది. ఇప్పటికే నగర ప్రజల కోసం మెట్రోను, ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకు రాగా.. మరో కొత్త ఆలోచనకు తెరతీసింది. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కష్టాలు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాలంటే పెద్ద టాస్క్. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటే వాహనాల సంఖ్య కూడా పెరుగుతూనే…

Read More

Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు!

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! హైదరాబాద్ అక్టోబర్ 16 Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) పార్టీ తెలంగాణ మంత్రులైన సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారిని సీనియర్ ఆబ్జర్వులుగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీ సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను జార్ఖండ్ పరిశీలకులుగా నియమించారు. KTR vs. Sitakka | కేటీఆర్ వర్సెస్ సీతక్క | Eeroju news

Read More

Minister Ponnam Prabhakar | గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు | Eeroju news

గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్

గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ చర్యలు హైదరాబాద్, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Minister Ponnam Prabhakar గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదు.. ఈ విషయాన్ని యజమానులు గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో వివరాలు తెప్పించుకుని సమావేశాలు కూడా నిర్వహించాం. నేడో రేపో నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ సమయంలో ఎవరి మాటలో పట్టుకుని కావాలని కవ్వింపు చర్యలకు…

Read More

Heavy rains | పలు జిల్లాల్లో భారీ వర్షాలు | Eeroju news

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్ Heavy rains బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లా చీరాల లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న చెదురు ముదురు జల్లులకు రోడ్లు జలమయం కాగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

Read More

Hyderabad | ఈ సారి చలి ఎక్కువే | Eeroju news

ఈ సారి చలి ఎక్కువే

ఈ సారి చలి ఎక్కువే హైదరాబాద్, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Hyderabad ఈ చలికాలంలో హైదరాబాద్‌ సహా తెలంగాణ ప్రజలు అధిక చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్టోబరు, నవంబరు మధ్య కాలంలో లా నినా కారణంగా ఈ చలికాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. భూమధ్యరేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గితే దాన్ని లా నినా అంటారు. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే లా నినా ఎఫెక్ట్‌ అంటారు. పసిఫిక్ మహాసముద్రం పెరూ తీరంలో ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతాయి. లా నినా తరచుగా తెలంగాణతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణానికి దారి తీస్తుంది.ఐఎండీ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చలికాలంలో ప్రజలు వణికిపోవాల్సిందే. ఉదయాన్నే పొగమంచు…

Read More

Konda Surekha and KTR | మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా | Eeroju news

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా హైదరాబాద్ అక్టోబర్ 15 Konda Surekha and KTR భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏ, మాజీ మంత్రి కెటి.రామారావు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనకు, నటి సమంత రుత్ ప్రభుకు అక్రమ సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. అంతేకాక సురేఖకు లీగల్ నోటీసు కూడా పంపారు. Akkineni Nagarjuna argument | కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన | Eeroju news

Read More

Ratan Tata | రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం | Eeroju news

రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం

రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం హైదరాబాద్ అక్టోబర్ 15   Ratan Tata దిగ్గజ పారిశ్రామివేత్త, రతన్ టాటా మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతిపట్ల నటుడు, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రతన్ మరణం దేశానికి తీరని లోటు అని, భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఆదర్శం అని ప్రశంసించారు. ఉప్పు నుంచి మొదులుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనిస్తుందన్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని పవన్ ప్రశంసించారు.భారత దేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శినికుల్లో ఆయన ఒకరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సేవలో రతన్‌ను మించిన వారు…

Read More

CM Revanth Reddy | బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది | Eeroju news

CM Revanth Reddy

బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy బిఆర్ఎస్ సర్కారు 5వేల పాఠశాలలను మూసివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో విద్యా వ్యవసస్థను ప్రక్షాళన చేస్తున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయలేదన్నారు. నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. బదిలీలు, ప్రమోషన్లు టీచర్లకు అవకాశం కల్పించారు. 34వేల మంది టీచర్లను బదిలీలు.. 21వేల మంది ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని తెలిపారు.…

Read More