అన్నా..చెల్లి మధ్య సరస్వతి పవర్స్… అసలేం జరిగింది… హైదరాబాద్, అక్టోబరు 4, (న్యూస్ పల్స్) Political ఏపీలో పొలిటికల్ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్ నోటీస్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు చెల్లెలు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. సరస్వతీ పవర్ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి.…
Read MoreTag: Hyderabad
TBJP is set right | టీబీజేపీ సెట్ రైట్ అయినట్టేనా | Eeroju news
టీబీజేపీ సెట్ రైట్ అయినట్టేనా హైదరాబాద్, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) TBJP is set right తెలంగాణ బీజేపీలో అంతా సెట్ రైట్ అయినట్టే కనిపిస్తోంది. ఇంతవరకూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్ననేతలు..ఒక్కతాటిపైకి వచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్‌బన్సాల్ పర్యటన, నేతలతో కీలక సమావేశాల నేపథ్యంలో కాషాయ నేతలంతా ఏకమయ్యారు. దీంతో కమలం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్‌లో మూసీ అంశంలో ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది..తెలంగాణ బీజేపీ. మూసీ బాధితుల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ 25న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కూడా చేపట్టింది తెలంగాణ బీజేపీ..మరోవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ నేతల బృందం.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం, హిందూ సంఘాలపై కేసుల నమోదుపై ఫిర్యాదు చేసింది.…
Read MoreHyderabad | సియోల్ లో పర్యటిస్తున్న మంత్రులు.. అధికారులు | Eeroju news
సియోల్ లో పర్యటిస్తున్న మంత్రులు.. అధికారులు హైదరాబాద్, అక్టోబరు22 (న్యూస్ పల్స్) Hyderabad మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సియోల్ లో చుంగేచాన్ తీరాన్ని, వ్యర్థాల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను బృందం సందర్శించింది. ఒకప్పుడు మురికి కూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తోంది. ఇదే తీరులో హైదరాబాద్ లోని మూసీని పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.దక్షిణ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రతినిధుల బృందం సందర్శించింది. సియోల్ నగరంలో…
Read MoreTelangana | కేటీఆర్ కు పిచ్చిలేసి మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి | Eeroju news
కేటీఆర్ కు పిచ్చిలేసి మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి హైదరాబాద్ Telangana దామగుండం కి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్ కి ఎందుకు గుర్తు లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. 9 లక్షల చెట్లు పోతాయి అని తెలిసి ఎందుకు జీవో ఇచ్చినవు. కేటీఆర్…జీఓ లో ఏముందో తెలుసా నీకు. ఎన్ని చెట్లు తీస్తే.. అదే సంఖ్యలో చెట్లు పక్కన నాటాలని ఉంది. ఇదెందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్..కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి డబ్బులు పంపలేదా..? కేజ్రీవాల్ కి పంపింది నువ్వే కదా.. అందుకే మీ చెల్లెల్ని జైల్లో పెట్టింది కదా బీజేపీ. నవీన్ పట్నాయక్ కి ఫండింగ్…
Read MoreCyber Commandos | రంగంలోకి సైబర్ కమాండోలు… | Eeroju news
రంగంలోకి సైబర్ కమాండోలు… హైదరాబాద్, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Cyber Commandos తెలంగాణలో రూ.759 కోట్లు, మహారాష్ట్రలో రూ.990 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 721 కోట్లు, తమిళనాడులో 662 కోట్లు, గుజరాత్లో 650 కోట్లు.. ఇదీ రాష్ట్రాలవారీగా సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలో కొల్లగొట్టిన సొత్తు విలువ. సైబర్ నేరాలపై 2023లో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు దేశవ్యాప్తంగా 11, 28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా బాధితులు మొత్తం రూ.7,488.6 కోట్లు కోల్పోయారు. ఈ సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది. శిక్షణ పూర్తి చేసుకుని త్వరలో రంగంలోకి దిగబోతున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం…
Read MoreTelangana | ఫస్ట్ నుంచి కరెంట్ షాక్… | Eeroju news
ఫస్ట్ నుంచి కరెంట్ షాక్… హైదరాబాద్, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉండడం, టీపీసీసీ చీఫ్‌గా తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి అనేక హామీలతోపాటు, ఆరు గ్యాంరటీ హామీలు ఇచ్చాడు. దీంతో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. పదినెలల కాలంలో కొన్ని హామీలు అమలు చేశారు. ముఖ్యంగా రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. అయితే సబ్సిడీల భారం పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ప్రధానంగా విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు…
Read MoreBachupally Narayana College | బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం | Eeroju news
బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Bachupally Narayana College హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. అనూష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దసరా సెలవుల తర్వాత నిన్ననే కాలేజీకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు కాలేజీలో దింపి హైదరాబాద్ దాటే లోపే విద్యార్థిని స్పృహ కోల్పోయిందన్న సమాచారం వచ్చింది. అనూష ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూష అనే విద్యార్ధిని బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులు అనంతరం అనూషను.. ఆమె తల్లి దండ్రులు ఆదివారం నాడు హాస్టల్‌లో వదిలిపెట్టి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే విద్యార్దిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని…
Read MoreTelangana | తెలంగాణ ఆదాయం తగ్గింది | Eeroju news
తెలంగాణ ఆదాయం తగ్గింది హైదరాబాద్ Telangana మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక అంశాల పై మాట్లాడారు. .ఆర్థిక శాఖ పై సచివాలయం లో సమీక్ష చేసినపుడు సీఎం ఓ రకంగా ఐఎస్బీ కార్యక్రమం లో మరో రకంగా మాట్లాడారు. రాష్ట్రానికి మద్యం ఆదాయం మినహా అన్నిటిలో తగ్గింది. సీఎం రాష్ట్ర ఆదాయం తగ్గుదల విషయం లో ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. .రాష్ట్రానికి ఆదాయం ఎందుకు తగ్గిందని సీఎం లోతుగా సమీక్ష చేయడం లేదు రేవంత్ పదినెలల్లో ఏ వర్గం లో విశ్వాసం నమ్మకం కలిగించలేకపోయారు ..అందుకే ఆదాయం తగ్గిందని అన్నారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పై పడింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం…
Read MoreKCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news
మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) KCR ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన చాలా వరకు పోరాడుతున్నారు. ఇటు వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. వరుసగా మూసీ బాధితులను కలుస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి ధైర్యం ఇస్తున్నారు. మీ తరఫున తాము కొట్లాడుతామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. మరోవైపు.. మూసీ ప్రాజెక్టుపై ఎవరికి వారుగా అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ నిత్యం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. విలేకరుల సమావేశాలు పెడుతూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎవరికి వారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు…
Read MorePatancheru | పఠాన్ చెరువులో పట్టాలెక్కేది ఎలా | Eeroju news
పఠాన్ చెరువులో పట్టాలెక్కేది ఎలా హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Patancheru గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడటంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయనతో పాటు హస్తం గూటికి చేరిపోతారనుకున్నారంతా. గూడెం కూడా అదే భావించారు. కానీ అలా జరగలేదు. బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్ మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలకపక్షమే ఉంది. ఇందులో అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి ను వీడి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ కొలను రోజా, తెల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్ లలితా సోమిరెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇక GHMC పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కూడా గూడెంతో వెళ్ళబోమంటూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో గూడెం…
Read More