గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్ హైదరాబాద్, ఫిబ్రవరి 12, (న్యూస పల్స్) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు అవిశ్వాస తీర్మానం వ్యవహారంతో రాజకీయపార్టీల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి విజయ సాధించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలు తమ కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేస్తు్న్నాయి.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవిశ్వాసంపై ఎలా ముందుకు వెళ్లాలనే…
Read More