గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు కాకినాడ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ప్రచార పర్వం మరింత వేగంగా సాగుతోంది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నాయకత్వంలో కూటమి ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికలు ఇదే మొదటిసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లా నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్‌ను బరిలో దింపింది కూటమి నాయకత్వం. గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు నుంచి సభ్యత్వాల నమోదు వరకు ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యతలు పెట్టిన నాయకత్వం ఆ దిశగా పనిచేయకపోయిన వారికి…
Read More