ఈవీఎంల వ్యవహారంపై ఏకాకిగా కాంగ్రెస్ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటేనే ఓ భారీ కసరత్తు. అటూ ఇటుగా 100 కోట్ల జనాభా పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతుంటాయి. ఇదంతా ఒకెత్తయితే.. దేశంలో జరిగే ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ సంబరాలు చేసుకుని తమ ఘనతగా చాటుకునే కాంగ్రెస్ పార్టీ.. ఓడినప్పుడు మాత్రం ఈవీఎం ‘గోల్‌మాల్’ అంటూ గోల చేస్తోంది. ఆ పార్టీకి ఇది కొత్తేమీ కాదు. కానీ ఈసారి కనీసం మిత్రపక్షాల నుంచి మద్ధతు లభించకపోగా.. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ మిత్రపక్షాలే తలంటేస్తున్నాయి. మొన్న జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), నిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)లు కాంగ్రెస్ వాదనను తప్పుబట్టాయి. దీంతో ఈవీఎం గోల్‌మాల్ ఆరోపణల విషయంలో…
Read More