గ్రామ సభలకు అంతా సిద్ధం ఏలూరు, ఆగస్టు 21, (న్యూస్ పల్స్) Deputy CM Pawan Kalyan is all set for the gram sabhas ఈ నెల 23 నుంచి గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలు ఏంటి, పరిష్కరించాల్సిన అంశాలు ఏంటి అన్న విషయాలపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణకు రూపొందించిన మొబైల్ యాప్ ఎలా పని చేయనుందో సీఎంకు వివరించారు అధికారులు.గ్రామీణాభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యంపై రివ్యూ నిర్వహించారు. పారిశుధ్యం నిర్వహణపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అన్న దానికి సంబంధించి ఒక యాప్ ను గ్రామీణాభివృద్ధి శాఖ…
Read MoreTag: Elur
Bring reservations to the fore again | మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు | Eeroju news
మళ్లా తెరపైకి కాపు రిజర్వేషన్లు ఏలూరు, జూలై 29, (న్యూస్ పల్స్) Bring reservations to the fore again కాపుల రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదో పెండింగ్ అంశంగా మారిపోయింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరినా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ ఉద్యమం ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం, ఇంకో పార్టీకి నష్టం చేకూర్చడం మాత్రం ఆనవాయితీగా వస్తోంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది దశాబ్దాల కల. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆవిర్భవించిన జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో…
Read MoreThe flow of Godavari is increasing | మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి | Eeroju news
మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి ఏలూరు The flow of Godavari is increasing గోదావరి నదిలో ప్రవాహ ఉదృతి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద 33.205 మీటర్లు నీటిమట్టం నమోదు అయింది. ప్రాజెక్ట్ నుండి 11 లక్షల 19 వేల 463 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేసారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో ఇంకా ముంపులోనే విలీన మండలాలు వుండిపోయాయి. ఇప్పటికే పునరావస కేంద్రాల్లో కుక్కునూరు మండలం లో 721 కుటుంబాలు వున్నాయి. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకి ఆశ్రయం కల్పించారు. ఉప్పర మద్దిగట్ల, వెంకటాపురం, సీతారామనగర్, శ్రీధర, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో రుద్రమకోట, రేపాక కొమ్ము, తాటుకూరుగొమ్ముబోళ్లపల్లి, చిగురుమామిడి, నల్లవరం, తూర్పు మెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు వున్నాయి. Slightly…
Read MoreWife, husbands.. as JC.. as SP.. | భార్య, భర్తలు… జేసీగా…ఎస్పీగా…. | Eeroju news
భార్య, భర్తలు… జేసీగా…ఎస్పీగా…. ఏలూరు, జూలై 26 (న్యూస్ పల్స్) Wife, husbands.. as JC.. as SP.. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు బ్యూరోక్రాట్లు ప్రేమించి వివాహం చేసుకుని ఒకటి కావడమే. మరీ ముఖ్యంగా వీరిద్దరూ ఒకేచోట ఏలూరు జిల్లాలో పనిచేస్తుండటమే మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి. వీరిలో కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, ధాత్రి రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ అమ్మాయి. ధాత్రిరెడ్డి, కిశోర్..…
Read MorePolavaram | ఇక పోలవరం పరుగులే… | Eeroju news
ఇక పోలవరం పరుగులే… ఏలూరు, జూలై 24, (న్యూస్ పల్స్) Polavaram పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడంతో కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. విభజన హామీల అమలు విషయంలో తరచూ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుండటంతో బీజేపీ పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.2014-24 మధ్య కాలంలో జరిగిన రకరకాల పరిణామాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరించేందుకు కేంద్రం సుముఖత తెలిపింది. సోమవారం ఏపీ ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత నిధుల విడుదలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేశారు.విశ్వసనీయ…
Read MoreThe rains caused huge damage | అపార నష్టాన్ని మిగిల్చిన వానలు | Eeroju news
అపార నష్టాన్ని మిగిల్చిన వానలు ఏలూరు, జూలై 23 (న్యూస్ పల్స్) The rains caused huge damage ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలం అయ్యాయి. పంట మునకతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం పచ్చగా ఉండే కోనసీమ ప్రాంతమంతా నీటి ముంపులో ఉంది. కాకినాడ ప్రాంతంలో తీర ప్రాంతంలో ప్రజలు సముద్ర కోతతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో ఉన్నారు. రాజమండ్రి ప్రాంతంలోని కడియం వంటి ప్రాంతాల్లో రోడ్లన్ని వాగులను తలపిస్తున్నాయి. నర్సరీలు, ఉద్యాన పంటలు నీటిలోనే ఉన్నాయి. అలాగే వరి పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయికోనసీమ ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉండ్రాజవరం ఎర్ర కాలువ నీరు గట్లు…
Read Moreటీచర్ల కోసం వేడుకోలు.. | Eeroju news
టీచర్ల కోసం వేడుకోలు.. ఏలూరు, జూలై 16, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల కోసం తాము మట్టితో షెడ్‌ను నిర్మించుకున్నామని, ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్పందన కోసం ఆ గిరిజన గ్రామం ఎదురు చూస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగల్ బంధ గ్రామంలో 28 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మొత్తం 136 మంది జనాభా ఉన్నారు. వీరంతా కొండదొర ఆదివాసీ గిరిజనలు, వీరు కొండ చిట్టచివర జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. తెంగల్ బంధ గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా గంగవరం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రెండు వాగులు దాటుకొని, స్కూల్‌కి…
Read MoreThalliki vandanam | తల్లికి వందనం విధివిధానాలు ఖరారు | Eeroju news
తల్లికి వందనం విధివిధానాలు ఖరారు ఏలూరు, జూలై 11, (న్యూస్ పల్స్) Thalliki vandanam ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఐడెంటిటీగా కింది వాటిలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఫొటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్ పాన్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు ఫొటో ఉన్న కిసాన్ కార్డు గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫిషియల్…
Read MoreRaghu rama krishna raju | రఘురామ రూటే వేరు… | Eeroju news
రఘురామ రూటే వేరు… ఏలూరు, జూలై 3, (న్యూస్ పల్స్) Raghu rama krishna raju కనుమూరి రఘురామకృష్ణరాజు పరిచయం అక్కరలేని పేరు. నరసాపురం ఎంపీగా ఆయన 2019 నుంచి 2023 వరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీకే కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ పార్టీపైన, అధినేత జగన్ పైన విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నరసాపురం టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఆ సీటు కూటమిలో పొత్తులో భాగంగా బీజేపీ ఎగరేసుకుపోయింది. ఇక రాజును కాదనలేక, బయట ఉంచలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆయనకు ఉండి శాసనసభ టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.కూటమి అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారంటీ…
Read MoreInternational experts examining Polavaram | పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు | Eeroju news
పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు ఏలూరు,జూలై 2, (న్యూస్ పల్స్) International experts examining Polavaram ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు విజిట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నిపుణులు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. పోలవరం ప్రాజెక్టుపై ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులు తొలగించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది కేంద్రప్రభుత్వం. డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి డిజైన్ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంది. దీనికితోడు అమెరికాకు చెందిన డేవిడ్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ బోన్నెల్లీ, సీస్ హించ్ బెర్గర్ వంటి నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. పోలవరానికి ఎదురైన సవాళ్లపై వీరు అధ్యయనం చేయనున్నారు. అంతర్జాతీయ డ్యామ్ భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరర్ ఇంజనీరింగ్, జియో…
Read More